'నారంశెట్టి' అనే మాటకు 'స్వచ్ఛమైన జలం' అని అర్థాన్నివ్వచ్చు శబ్దవేత్తలెవరైనా. శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు సాహిత్యం కూడా అటువంటిదే. ప్రవాహగతిలో సాగే కథలే ఇవన్నీ. కథలు చెప్పడంలో గొప్ప నేర్పు, తీర్పు కనబడతాయి. ఊహించని మలుపులతో ముగుస్తాయి. ఏ అంశాన్ని తీసుకున్నా సున్నితంగా చెప్పడం ఆయనకు అలవాఉ. సులభశైలి, సుతిమెత్తని వాక్యాలు, సునిశిత చమత్కారం, అదుపులో ఉండే అంతర్లీనాగ్రహం, వాటన్నిటితో పాటు రచయితకు ఉండవలసిన సామాజిక బాధ్యత ప్రతి కథలోనూ ద్యోతకమవుతాయి. ఆయన కథల్లో పరిమళించే మానవత్వం ఒక సాహితీ గుబాళింపు. ఆయన ఆలోచనల నుంచి ఉచికివచ్చే అక్షరాలు పాఠకుడితో పాటు పరుగిడతాయి.

Pages : 126

Write a review

Note: HTML is not translated!
Bad           Good