మహిళా జన జీవితాలకు దర్పణం 'ఉమెన్స్‌ కాలేజి'

తను చేస్తున్న వృత్తిని, ఆ వృత్తిపరంగా తాను కలుసుకోవడానికి అవకాశమున్న పోలీసు, న్యాయవ్యవస్థల మనుషులను, ఆ వ్యవస్థలతో అనివార్యంగా సంబంధంలో వుండే నేర ప్రచారాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించుకుంటూ నవలకు, కథలకు ఇతివృత్తంగా చేసుకొన్నారు రావిశాస్త్రి. అదే విధంగా విద్యావ్యస్థను కేంద్రంగా చేసుకొని అందులో విద్యార్థులుగా, అధ్యాపకులుగా, పాలనా వ్యవహారాకులుగా ప్రవర్తించే మనుషుల మద్య సంబంధాలను ఇతివృత్తంగా మలచుకొని నవలలు వ్రాయడానికి నవీన్‌ 'అంపశయ్య' నవల ద్వారా ప్రారంభకులయ్యారు.

ఉస్మానియా యూనివర్శటీ విద్యార్థిగా తన అనుభవాలను, జ్ఞాపకాలను, అనుభూతులను కలబోసి 'అంపశయ్య' నవల వ్రాసిన నవీన్‌ అధ్యాపకుడిగా స్థిరపడిన తరువాత మళ్ళీ కాలేజీలో జీవితాన్ని వస్తువుగా చేసుకొని వ్రాసిన నవల ఈ 'ఉమెన్స్‌ కాలేజి'. కాలేజీలను ప్రేయసీ ప్రియులు ఒకళ్ళకొకళ్ళు తటస్థపడే కేంద్రాలుగా మాత్రమే చేసి ఆ తరువాత ఇక ఆ కాలేజీలతో నిమిత్తం లేకుండా ఇతివృత్తాన్ని నిర్మించుకొంటూ పోయే నవలలు, సినిమాలు కోకొల్లలుగా వస్తున్న సమకాలీన పరిస్థితులలో ఆ ఒరవడిలో పడి కొట్టుకొని పోకుండా నిలిచిన రచయిత నవీన్‌. 'ప్రేమ' ప్రస్తావన లేకుండా మొదటి నుండి చివరి వరకు కథనంతా ఉమెన్స్‌ కాలేజీలోనూ, ఆ కాలేజీలో పని చేసే స్త్రీల చుట్టూనూ నడిపిస్తూ ఈ నవల వ్రాశాడు నవీన్‌. ఈ నవలలో కథ ఇట్లా ఉండటానికి అంతర్జాతీయ మహిళా దశాబ్ది స్త్రీ పురుషుల ఆలోచనా దృక్పథంలో తీసుకువచ్చిన అభివృద్ధికరమైన చైతన్యం నేపథ్యంగా పని చేసింది. - కాత్యాయనీ విద్మహే

పేజీలు : 261

Write a review

Note: HTML is not translated!
Bad           Good