తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి 1945 లో పుట్టారు. ఒంగోలులో, వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో విద్యాభ్యాసం, పుణే, దక్కన్ కళాశాలలో పురావస్తు శాస్త్రంలో పి.హెచ్.డి. చాలా సంవత్సరాలు కళాశాలల్లో అధ్యాపక వృత్తి. దాన్ని వదుల్చుకుని పూర్తి పర్యావరణ కార్యకర్తగా పని చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో 'వెన్విరాన్‌మెంట్ సెంటర్' అనే పర్యావరణ సంస్థ స్థాపించి, నిర్వహిస్తున్నారు, సంగీతం చాలా ఇష్టం. గజల్స్ అంటే మరీ ఇష్టం. సంస్కృతి, సామాజిక పరిణామం, గిరిజన జానపద గాథల విశ్లేషణ శాస్త్రిగారి అభిమాన విషయాలు. సినిమా అన్నా నాటకం అన్నా గఢమైన ఆసక్తి. పర్యావరణ సమస్యలగురించి రాయడం, మాట్లాడ్డం నిత్యకృత్యం, చింతనాశీలత శాస్త్రిగారి జీవలక్షణం, ఆయనకి జీవితం, సాహిత్యం, వేరు కాదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good