మార్క్‌ట్వేన్‌ వ్రాసిన 'రాజు-పేద', 'టామ్‌సాయర్‌', 'హకల్‌ బెరిఫిన్‌'లకు నండూరి రామ్మోహనరావు గారి అనువాదా సొగసు మార్క్‌ట్వేన్‌ను మనవాడేననిపించింది.
టామ్‌సాయర్‌, హకల్‌ బెరీఫిన్‌లకు తరువాయి భాగంగా వ్రాసిన టామ్‌సాయర్‌  అబ్రాడ్‌కు అనువాదమే ఈ టామ్‌సాయర్‌ ప్రపంచయాత్ర.
1954లో ఆంధ్ర వారపత్రికలలో సీరియల్‌గా వెలువడిన ఈ నవల ఒకేసారి పుస్తక రూపంలో వెలువడి గత అర్థ శతాబ్దిగా అలభ్యంగా ఉంది.
టామ్‌, హక్‌, జిమ్‌ కలిసి ఒక బెలూన్‌ విమానంపై ప్రపంచాన్ని చుట్టివచ్చే కథాంశంతో సాగిన ఈ రచన బాలబాలికలకు వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందిస్తుంది.
'బాలసాహిత్యం క్రింద తమ తొలి ప్రచురణగా దీన్ని 'హాసం' ఎంచుకోవడానికి కారణం ఇదే.
జగద్విఖ్యాత హాస్య రచయిత మార్క్‌ట్వేన్‌ రచనకు ప్రముఖ రచయిత, పాత్రికేయుడు, అనువాదకుడు నండూరి రామ్మోహనరావుగారి సమ్మోహనానువాదం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good