తరాలు  అంతరాలు

మానవ జీవితంలో ఒక తరానికి, మరొక తరానికి అంతరం సహజం. ప్రతివ్యక్తి జీవిత పరిణామక్రమంలో బాల్య, యౌవ్వన, కౌమార, వార్థక్య దశలుంటాయి. మొదటి తరం వ్యక్తులు వార్థక్యంలో ఉన్నప్పుడు, రెండవ తరం కౌమారంలో, మూడవ తరం బాల్య యౌవ్వన దశలలో ఉంటారు. బాల్యంలోని, యౌవ్వనంలోని ఆలోచనలకు ఆశయాలకు, కౌమార దశల్లోని ఆలోచనా సరళికి కర్తవ్యాలకు తేడా ఉంటుంది. ఈ క్రమంలో వార్థక్యపు శారరక మానసిక స్థితిగతులు అనేక మార్పులను సంతరించుకుంటాయి. ఇదంతా జీవుడు ప్రకృతి మధ్య జరిగే బేరసారాలు, స్పందన ప్రతిస్పందనలు. ఈ తేడాలను అధిగమించేందుకు, ప్రకృతి విధించే చట్టాలను ధిక్కరించకుండా వయస్సుకు తగిన రీతిలో నడుచుకుంటే ఆవేదనభరిత జీవితాల సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. అందుకే శంకరుడు 'సంసారం సాగరం దు:ఖం తస్మాత్‌ జాగ్రత్త జాగ్రత్త' అని బోధించాడు. సంసారం సమస్య మానవునికి మాత్రమే వుంటుంది. మిగతా జీవులు తమ సంతతి యెడల అనుసరించవలసిన కర్తవ్యాన్ని పూర్తిచేసి చేతులు దులుపుకుంటాయి. కాని మనం భార్యా బిడ్డలకు జీవితాంతం అతుక్కుని ఉండాలనే ఆశతో గాలానికి తగులుకునే చేపలలా బ్రతుకుతుంటాము. దీనికి చెలియలికట్ట లేదనిపిస్తుంది. ఈ నవల ఇతివృత్తం నేటి తరాల అంతరాలను తెలియజేయడమే.

...

ఆదిమ మానవుడు కొండ గుహల్లో, చెట్టు తొర్రల్లో, మాతృవ్యవస్థలను ఆసరా చేసుకుని జీవితాన్ని సాగించేవాడు. ఆనాడు ప్రకృతిలోని పంచభూతాల, క్రూరజంతువుల ద్వారా కలిగే అనూహ్య సంఘటనలు మనిషికి భయాన్ని బాధను కలిగిస్తుండేవి. ఆ కారణంగా నాటి మానవ జీవితం ప్రకృతితో యుద్ధం చేస్తుండేది.

స్త్రీకి ప్రకృతి ప్రసాదించిన వరం బిడ్డలను కనడం. ఆ బిడ్డలు అభివృద్ధిలోకి రావాలని కోరడం సహజం. అయితే ఆనాడు తమ బిడ్డలు, తమకళ్ళముందు జంతువుల బారిన పడి చనిపోతుంటే చూచి కనీసం కన్నీరు కార్చకుండా, జంతువుల్లా జీవితాలను నడిపిన మాతృ వ్యవస్థ చరిత్రకు అవగతమే. ఇలాంఇ విషయాలు తెలుసుకోవాలంటే రాహుల్‌ సాంకృత్యాయన్‌ 'ఓల్గా నుండి గంగాతీరం వరకు' లాంటి పుస్తకాలు చదవాలి.

మానవ జీవన ప్రయాణంలో అంతా సవ్యంగా జరిగితే ఎప్పుడూ మూడుతరాలు కలిసి నడుస్తాయి. రెండవ తరం తల్లిదండ్రులు, క్రంద తరం కుమారులు, కుమార్తెలు, పెద్ద తరం తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలకు, అనగా పై తరానికి క్రింది తరానికి వారధి అవుతారు. అయితే ప్రతి తరం మూడుతరాల పాత్రలను పోషించవలసి వస్తుంది. కాని ప్రతి తరం మరొక తరానికి పునాది రాళ్ళు అయి వరం కావచ్చు లేదా శాపం కావచ్చు. ఈ 'తరాలు అంతరాలు' జీవితాలను ఏ దిక్కుకు నడిపిస్తుందో తెలియదు. 'తరాలు  అంతరాలు' నవల పూర్వ తరానికి తరువాత తరానికి మధ్యతరం ఒక వంతెన లాంటిది. అది సరిగా లేకుంటే జీవిత గమ్యాన్ని చేరుకోలేక జనం చతికిలబడతారు. ఒకతరం చేసిన తప్పుల వల్ల అన్నితరాలు భ్రష్టుపట్టి పోతాయి. అసలు మొదట ఈ నవలకు 'వారధి' అని పేరుపెట్టి మరలా 'తరాలు అంతరాలు' అని మార్చబడినది.

అయితే ప్రతితరానికి తప్పు ఒప్పు చేసే అవకాశం ఉంటుంది. తప్పుచేసిన వారు కష్టాల, కన్నీళ్ళపర్యంతమైన జీవితాన్ని గడపడం, ఒప్పుచేసిన వాళ్ళు సుఖమయంగా జీవితాలను గడుపుకోవడానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అని అనిపిస్తుంది. ప్రతి తరం వాళ్ళ ఫలితం ఎలా వుంటుందంటే ఏ విత్తనం వేస్తే ఆ ఫలం చేతికి అందుతుంది. తరాల మధ్య వారధి శ్రీరాముడు కట్టిన వారధి అయితే సుఖసంతోషాలకు కొదువ ఉండదు.

పేజీలు : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good