తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.

సుప్రియ :

ఆమె సుగుణసుందరి సుభాషిణి సురుచి సునీత యింకా ఎన్నో...

ఆ సుప్రియ ఓ సిద్ధార్థ ప్రగాఢంగా ప్రేమించుకుని ప్రేమ సాఫల్యాన్ని హాయిగా జుర్రబోతున్న తరుణంలో.

పాలకుండలో విషపు చుక్కలలా పెదవి దగ్గర అమృత బాండం పగిలినట్లు ఓ దుర్ముహూర్తాన సుప్రియను ఎవరో అనుభవించేశారు.

అది మానభంగమో మరొకటో కాని..

ఈ అసందర్భపు దారుణం ఆమెలో తెచ్చిన అనేక మార్పులలో వారి జీవితం ఎన్నో మెలికలు తిరిగింది.

అపుడే ఆ చెలినెచ్చెలి ఆ సుప్రియ మరో చక్కని చుక్కని ఎంచి జత చేసి సిద్ధార్థకి త్రోవచూపి..

తను ఎంచుకున్న ఆనందపథంలోకి, మళ్ళా సిద్ధార్థ తన్ను చేరవచ్చినా వెనక్కి చూడక అల్పులకు అందనంత సేవా సౌభాగ్యానికి ఉన్నత ఆదర్శ మార్గంలో పయనించే వైనమే ఈ నవల.

పేజీలు : 224

Write a review

Note: HTML is not translated!
Bad           Good