కె.వి.నరేందర్‌ వస్తువు ఎన్నిక కథను నడపడంలో చూపిన, ఎంచుకున్న టెక్నిక్‌ అసామాన్యమైనది. శిథిల స్వర్గం తెలుగు నవలా సాహిత్యంలో కె.వి.నరేందర్‌ స్ధానాన్ని సుస్ధిరం చేసింది.

అత్యాధునిక కాలంలో జీవితం క్షణం క్షణం వేగంగా మారుతుంది. అయితే మారుతున్న బతుకు తీరుతెన్నులను ఆ మార్పులకు కారణమైన మూలాలను అద్దం పడితేనే ఆ నవల ప్రయోజనకరంగా నిలిచిపోతుంది. అదిగో, అటువంటి ప్రయోజనం నిబద్దతలతో కలిగిన నవల 'శిథిల స్వర్గం' రచయితగా కె.వి.నరేందర్‌ తెలుగులో సుపరిచితుడే కాక సుప్రసిద్ధుడు కూడా. కాని ఈ నవలతో కె.వి.నరేందర్‌ తన సమకాలీన నవలా రచయితల కంటే నాలుగు అడుగులు ముందు నిలిచాడు. ఎందుకంటే నవలను నడిపించిన శిల్పం అద్భుతమైనది. ఇంటి గోడలు, తెరచుకోని తలుపులు, చేదబాయి, చేతికర్ర, ఇనుప నిచ్చెన, గుడ్డిదీపం మరియు కరపత్రం వంటి వాటి ద్వారా కథా కథనాన్ని నరేందర్‌ నిర్మించిన తీరు అసామాన్యమైంది. అందుకే నరేందర్‌ తన కాలపు నవలా కారులందరి కన్నా నాలుగు అడుగులు ముందున్నాడని అన్నాను.

కె.వి.నరేందర్‌ ఈ నవల ద్వారా కొత్తపుంతలు తొక్కాడు. తెలుగు నవలా ప్రపంచంలో సరికొత్త పక్కా తొవ్వను ఏర్పరుచుకున్నాడు. ఈ నవలను నవనోన్వేషంగా నడిపించాడు. - జూకంటి జగన్నాథం

Write a review

Note: HTML is not translated!
Bad           Good