ఉమెన్స్‌ కాలేజిలో చదువుకుంటున్న యాభైమంది అందమైన అమ్మాయిలతో రాజేష్‌ దక్షిణభారతదేశ యాత్రకు బయల్దేరుతాడు.

బెంగుళూరు నగరంలో లాల్‌బాగ్‌లోని రంగురంగుల గులాబీల సొబగుల్ని తమ స్వంతం చేసుకోవాలని, మైసూరులోని బృందావన్‌ గార్డెన్‌లో సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తున్న వాటర్‌ ఫౌంటేన్స్‌తోపాటు తాము నృత్యం చేయ్యాలని, మహారాజా పాలస్‌ సౌందర్యాన్ని  చూస్తూ మైమరచిపోవాలని, ఊటీలోని పర్వతశిఖరాల మీదకు ఎగిరిపోయి ఆకాశాన్ని అందుకోవాలని, బొటానికల్‌ గార్డెన్‌లోని లాన్స్‌మీద పడిపోయి తనివితీరా దొర్లాలని, చెన్నైలోని మెరీనాబీచ్‌లో ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న సముద్ర కెరటాల్ని చూస్తూ కెరటంగా మారిపోవాలని, మహాబలిపురంలోని అద్భుత శిల్పాలను చూస్తూ శిల్పంగా రూపుదాల్చాలని కలలుగంటూ ఆ యాభైమంది విద్యార్థినులు అవధుల్లేని ఆనందోత్సాహాలతో వాళ్ళ లగ్జరీకోచ్‌లోకి ప్రవేశిస్తారు.

ఆ ప్రయాణంలో ఒకక్షణం ఆనందం... మరుక్షణం బాధ... ఒకక్షణం నవ్వుల జల్లు.. మరుక్షణం ఏమౌతుందోనన్న ఆందోళనల హాహాకారాలు. సాఫీగా సాగుతుందనుకున్న ప్రయాణంలో ఎన్నో అనూహ్యమైన అవాంతరాలు...అనేకచోట్ల యాభైమంది అందమైన అమ్మాయిల్ని ఒకేచోట ఒకేసారి చూసిన ఎందరో యువకుల కళ్ళు జిగేలుమంటాయి. వాళ్ళను ఎలాగైనా తమవైపు తిప్పుకోవాలన్న వెర్రి ప్రయత్నంలో వాళ్ళు చేసే వికృతచేష్టలు.. ఆ యువకుల్ని ఉడికించటానికి  కొందరు ప్రమదలు చేసే చిలిపి చేష్టలు... ఈ నవలలో ఇవన్నీ పాఠకుల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి.

పేజీలు : 295

Write a review

Note: HTML is not translated!
Bad           Good