తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.

నవతరం :

ప్రతి మనిషి జీవితంలో రహస్యాలుంటాయి.

అంతరాంతరాలలో ఎక్కడో మారుమూల విస్మృతిలో పడివుండవలసిన రహస్య వృత్తాంతాలు అనేక సంసారాలలో అనురాగాలలో ఆత్మీయతలకూ విఘాతం కలిగిస్తాయి.

        రాజారావు మనసులోని దారుణ రహస్యం ఏమిటి? నిజానికి అతడి కుమార్తెను ప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేయడానికి అభ్యంతరం చెప్పవలసిన పనిలేదు కాని, అతని ధోరణి ఎవరికీ అంతుపట్టలేదు, అతని జీవితంలో పాలుపంచుకున్న అర్థాంగికీ, మిగిలిన వారందరికీ ప్రత్యేకించి ప్రసాద్‌కూ, రాజారావు పోకడ అర్థం కాలేదు. దానితో వాతావరణం కలుషితమయింది.

కాని నిశ్చల... రాజారావు కూతురు... అక్షరాలా నవతరం యువతి... నవభావాలకు ప్రతీక... ఆమె సమస్యకు అతి సున్నితమైన పరిష్కారం కుదిరింది.

ఆద్యంతమూ పాఠకులను ఆకట్టుకొనే అద్భుత శైలితో ఊపిరి సలపనీయని కథన చాతురితో, ఆసక్తిదాయకంగా సాగిన రచన నవతరం.

పేజీలు : 167

Write a review

Note: HTML is not translated!
Bad           Good