మేడమీది డ్రాయింగ్ రూమ్ కి ఎడంగా ఉన్న ఒక గదిలో ప్రశాంత చిత్తంతో ధ్యానముద్రలో ఉన్నాడు కపిధ్వజుడు. పక్కన పడుందికోతిబొమ్మ. ఆ సమయంలో ఆ మహాయోగి అంతరంగంలో ఏదో చిన్న అలజడి. ఆయన కర్ణేంద్రియాలకు సుదూర ప్రాంతంలో ఎక్కడో ఉన్న గురుదేవుల పలుకులు ఏవో ఆజ్ఞాపిస్తున్నాయి. ఉలికిపడి కళ్ళు తెరిచాడాయన.
అలౌకికానందంలో ఎప్పుడూ ప్రశాంతంగా కన్పించే ఆ మహనీయుని ముఖంలో ఇప్పుడు ఆందోళనఛాయలుకన్పిస్తున్నాయి. క్షణం కూడ ఆలస్యం చేయకుండా లేచి పాదుకలు ధరించి త్రిశూలం అందుకున్నాడు. గదిలోంచిబయటకొచ్చిటెర్రస్మెట్లవైపు దారితీశాడు.
ఆయన నడుస్తుంటే పాదుకలు చేస్తున్న చప్పుడు తప్ప అంతటా నిశ్శబ్దంగా ఉంది. వాతావరణం మసక చీకటిగా మారి ఈదురుగాలివీస్తోంది.
ఆయన టెర్రస్మీదకుచేరుకునేసరికి ఆకాశం చాలా వేగంగా కారుమబ్బులతో నిండిపోయింది. ప్రళయం ముంచుకురానుందాఅనిభయపెట్టేంత వేగంగా మబ్బులు చిక్కగా ముసురుకుంటున్నాయి.
టెర్రస్ మధ్యలో కొచ్చి నిలబడి ఎర్రబారినకళ్ళతో ఆకాశం వంక ఉరిమి చూశాడు. ఆ క్షణంలో పరమశివుని ప్రతిరూపంలా గోచరిస్తున్నాడాయన.

Write a review

Note: HTML is not translated!
Bad           Good