శ్వేత జాతీయుల ప్రముఖుడికి లేఖ
శ్వేత జాతీయుల రాజ్య ప్రముఖుడు కబురు పంపించాడు మా భూమిని కొనాలనుకుంటున్నామని! స్నేహ సంబంధాలను కోరుతూ వారి సైన్యాధిపతి సందేశం కూడా పంపాడు! అది వారి సహృదయతకు నిదర్శనం! మాతో స్నేహం చేయవలసిన అవసరం వారికి లేదని మాకు తెలుసు! అయినా వారి ప్రతిపాదన గురించి ఆలోచిస్తాం. బహుశా అప్పుడు మీరిచ్చిన భూమిలో (మా ఇష్టప్రకారం) మా ఆఖరి క్షణాలు గడుపుతాం. ఈ భూమిపై ఆదివాసులు అంతరించాక ఈ సముద్రతీరాలూ, ఈ ఎగుడు దిగుడు వనాలూ నా జాతీయుల ఆత్మను సంరక్షిస్తాయి! ఇప్పుడే కళ్ళు విప్పిన పసికందు తల్లి ఉనికిని ఎంతగా ప్రేమిస్తుందో అంతగా నా జాతీయులు ఈ ధరిత్రిని ప్రేమిస్తున్నారు. అందుకే మేము కనుక ఈ భూమిని మీకు అమ్మితే మాలాగే మీరు కూడా ఈ నేల తల్లిని ప్రేమించండి! దీని నెంతగా మేము సంరక్షించామో, మీరు అంతగా సంరక్షించిండి! మీ సర్వశక్తులూ ధారపోసి మనసారా ఈ భూమిని మీ పిల్లల కోసం సంరక్షించండి! అందరికీ తండ్రి - ఆ దేవుడు మనని ప్రేమించినంతగా ఈ పుడమి తల్లిని ప్రేమించండి! ఎందుకంటే ఈ భూమిని వారికి మేము అమ్మకపోతే తెల్లవారు తుపాకీలతో సహా రాగలరు! నింగికీ, నేల తల్లి ఆప్యాయతకూ వెలకట్టగలమా?

ఈ భావమే మాకు వింతగా ఉంది. గాలి ఘుమ ఘుమలు, నీటి తళతళలూ మా సొమ్ము కానపుడు వాటిని ఎలా అమ్మగలం? ఈ భూమిపైన అణువణువూ నా ప్రజలకు ఎంతో పవిత్రమయినది. మెరిసే ప్రతి ఆకూ, ఇసుక తీరం, సంధ్య వేళ పొగమంచు కమ్మిన అడవీ, మైదానం ఘమ్మని పాడే ప్రతి పురుగూ నా జ్రల అనుభవాల్లో స్మృతుల్లో పవిత్రమయినవి. చెట్లలో ప్రవహించే జీవజలం రెడ్‌ ఇండియన్ల జ్ఞాపకాలను మోసుకెళుతుంటుంది. తెల్లవాళ్ళు చచ్చిపోయి చుక్కల్లో కలిసినప్పుడు తాము పుట్టిన దేశాన్ని మరచిపోతారు. అందమయిన ఈ పుడమి రెడ్‌ ఇండియన్లకు తల్లి వంటిది. అందుకే మా వాళ్ళు చనిపోయినప్పటికీ ఈ మట్టిని మరచిపోరు. మేము మట్టిలోని వాళ్ళం. భూమి మాలో సగం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good