ఇలియాడ్‌. ఇది ఒక గ్రీకు మహాకావ్యం. హోమర్‌ మహాకవి దీని తొలి రచయిత. అప్పటికే ప్రజల్లో ప్రచారంలో ఉన్న కథకి హోమర్‌ మహాశయుడు కావ్యరూపం ఇచ్చాడంటారు. రెండోది ఒడిసీ. హోమర్‌ తర్వాత ఇప్పటివరకూ అనేకమంది రచయితలు అదే కథను విభిన్న రీతులలో రాశారు. ఈ గాథల్లో విభిన్న కథనాలు కనిపిస్తాయి. ప్రతి రచయితా తనదైన రీతిలో కథ చెప్పాడు. వేర్వేరు పుస్తకాల్లో వేర్వేరు కథనాలు కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో అవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. తెలుగు రచయిత ముత్తేవి రవీంద్రనాథ్‌ ఒకవైపు హోమర్‌ కథనాన్ని అందిస్తూనే మరోవైపు ఇతర కథనాలను కూడా ప్రస్తావించారు. ఆ రకంగా మన హృదయాలతో పాటు మేధస్సును కూడా అలరించడానికి ఆయన ప్రయత్నించారు. రసాస్వాదనతో పాటు ప్రాచీన గ్రీకు కావ్యాల గురించి ఎంతో విషయపరిజ్ఞానాన్ని ఈ పుస్తకపఠనం ద్వారా పొందవచ్చు. ఇది ఒక రమణీయమైన కావ్యం. ఒర రెఫరెన్సు గ్రంథం కూడా. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good