తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.
ఎంత ఘాటు ప్రేమయో :
''వోయ్! ఏం చేస్తున్నారు మేడమ్ ?''
''హాయ్ వసంత్! ఈ సమయాన బార్ వదలి ఇక్కడికి రావడం ఆశ్చర్యంగా ఉందే...
''మగువను మధువుతో పోల్చారు. నీ మత్తులో పడి ఆ మాట మరచిపోదామని'' చనువుగా ఆమె యెదుటి కుర్చీలో కూర్చుంటూ అన్నాడు.
''ఏ మత్తు అయినా మత్తే కదా. మామూలుగా ఉండరాదు'' అన్నది నవ్వుతూ.
అతను తనెంత గాఢంగా ఆమెను ప్రమించాడో చెప్పబోయాడు.
''హల్లో మేడమ్!'' మధుకర్ వచ్చాడు.
''హల్లో... హల్లో...! ఏం మధుకర్ నల్లపూసవయ్యావ్!||
''నల్లపూసవయి మా ఆవిడ మెడలో దాక్కుందామంటే, పెళ్ళి కాలేదు'' అన్నాడు మధుకర్.
మాదిరెడ్డి సులోచనగారి మరో సృష్టి. ఎంత ఘాటు ప్రేమయో...
పేజీలు : 167