పెళ్ళితో ఆర్ధిక భద్రత, మనసుకు ఆలంబన, జీవితానికి స్ధిరత్వం ఏర్పడితే చాలు స్త్రీ జీవితానికి అంతకన్న కావలసిన వరముంటుందా అని తలచే రోజులు కావివి. నేటి యువతిలో అర్ధవంతమైన ఆవేశం ఆమె వ్యక్తిత్వానికి వన్నెలద్దుతోంది. ఈ నేపధ్యంలో మనసును కుదిపిన అక్షరాలోచనలు!
''మీ పేరు''
''రాజేంద్ర''
''మరి మీరు ఏ ఉద్యోగానికి వచ్చారో తెలుసా?''
''కేర్‌ టేకర్‌''
పేరుకు కేర్‌టేకర్‌ అయినా అతని బాధ్యతలు మీడియేటర్‌గా, రిపోర్టర్‌గా అందరిపై ఓ కన్ను వేసి ఉంచాలనే పనిని నిర్వర్తించాలని అర్ధమైన రాజేంద్ర ఉద్యోగానికి సముఖత చూపక తిరస్కరిస్తాడు. అయినప్పటికీ విచిత్రంగా అతడి నిర్మొహమాటమే ఆ ఉద్యోగానికి అర్హత కల్పించింది. తెలివికి మారుపేరేన ఆ కుర్రాడి పట్టుదల, కృషి, జీవితం చివరికి ఏ మలుపు తిరిగింది? నవలలోని స్నేహసౌరభాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు, అసూయలు, అనుమానాలు వెరసి సమాజంలోని వ్యక్తుల విభిన్న ప్రవర్తనలు జీవితాలపై చూపే ప్రభావం...అద్దంలోనైనా కాస్త చూపించగలిగితే మనిషి దార్శనికుడైతాడు. నేటి మనిషి మనుగడకు అత్యవసర ఔషధం మానవత్వమేనన్న భావనే ఈ నవలకు శ్రీకారం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good