''చినదొరసాని ప్రవర్తనేమిటో అర్థం కాడంలేదండీ! మొన్న మంత్రగాడు, 'నీకు నాట్యం వచ్చటగా! నాట్యం చేయవా?' అని అడిగాడు. ఈమె తైయ్యని ఆడడం మొదలుపెట్టింది. గిర్రున తిరిగి గంతులు వేసింది. దొరగారికి చాలాకోపం వచ్చింది. సిటీ పంపిచేస్తానని అరిచారు. 'నేనెందుకు వెడతాను? ఇక్కడే వుంటాను' అని ఈవిడా పెద్దగా అరిచారండీ. దొరగారు వెళ్లి మంత్రగాడిమీద మండిపడ్డారు. 'నిన్ను పూజలో కూర్చోబెట్టింది మా అమ్మాయిని ఆడించడానికీ, పాడించడానికీనా?' అని అడిగారండీ. 'ఏం తోచక పాడించుకొన్నాను, ఆడించుకొన్నాను' అని జవాబు చెప్పాడండీ మంత్రగాడు. దొరగారు ఆయన్ని పూజలో ఎందుకు కూర్చోబెట్టారోగాని, ఆ మంత్రగాడు అమ్మాయిగారిని ఏదో చేసేట్టున్నాడండీ! పరధ్యానంగా ఏమిటో నవ్వుకొంటూ వుంటారండీ ఆమె.''
కాంచన ఆడమంటే ఆడుతుందంటే, పాడమంటే పాడుతుందంటే అర్థమేమిటి? ఆమెను అతడు వశపరచుకొన్నాడని తెలుస్తూనే వుంది.
ఆమె అతడిని ఛాలెంజ్ చేయడం గుర్తువచ్చింది నాకు. 'పిల్లులమీదా, బల్లులమీదా ప్రయోగించి నా విద్యను అవమానించుకోలేను. నువ్వు అనుమతి ఇస్తే నీమీదే ప్రయోగించి చూపుతాను. నిన్ను నా ముందు చేతులు కట్టుకొని నిలబడేలా చేస్తాను' దేవరాజం అనడం గుర్తువచ్చింది.
పేజీలు : 288