'మరి ఈ పెద్దమనిషి ఇంత అర్థరాత్రి ఇక్కడికెందుకొచ్చినట్లు...? - అర్ధం కావడం లేదు శివస్వామికి.
అర్థనిమీలితుడై ఏదో ఆలోచిస్తున్న ఆ వ్యక్తి వైపు శివస్వామి మౌనంగా చూస్తూ -
''ఇంతకీ తమకు ఏం కావాలి?'' అడిగాడు.
పెదవి విప్పాడాయన.
''చావు గురించి తెలియజేసే మృత్యుకాండ... వచ్చే జన్మ గురించి తెలియజేసే పునర్జన్మ కాండ... వివరాలు తెలియజేయగలరా?'' అడిగాడు - వ్యక్తి ఎక్కడో ట్రాన్స్‌లో వున్నట్లుగా.
అది వింటూనే షాక్‌ తిన్నాడు శివస్వామి... (పుట-38)
వైదీశ్వరన్‌ కోయిల్‌ - నాడీ జ్యోతిష్యం నేపథ్యంలో జన్మల పరంపరపై రూపొందిన కథే అహో విక్రమార్క స్వాతి వారపత్రికలో 47 వారాల పాటు సీరియల్‌గా వచ్చి పాఠకాదరణ పొందిన నవల యిది. నాడీ జ్యోతిష్యం ద్వారానూ, ఒకానొక సిద్ధుడి ద్వారానూ తన మరణ ఘడియని తెలుసుకుంటాడు విశ్వాత్మ.
విశ్వాత్మ ఓ సంపన్న పారిశ్రామికవేత్త. మామూలు సాదాసీదా కార్మికుడిగా జీవితం ప్రారంభించిన విశ్వాత్మ పేదరికం వల్ల ఎన్నో అవమానాలను ఎదుర్కొంటాడు. ప్రాణానికి ప్రాణమైన మనిషినీ పోగొట్టుకుంటాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని రేయింబవళ్లూ శ్రమిస్తాడు. అనుకున్నట్లుగానే చేతినిండా డబ్బు సంపాదిస్తాడు. పారిశ్రామిక జగత్తునే శాసించే స్థితికి ఎదుగుతాడు. అయితే ఒక చిత్రమైన కల అతడిని వెన్నాడుతుంది. ఎలాగైనా తన తర్వాతి జన్మ ఏమిటో తెలుసుకోవాలని బయలుదేరతాడు. ఆ తర్వాత ఒకటి వెంట ఒకటిగా జరిగే ఘటనలు నవలలో చదవాల్సిందే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good