కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి ఆశయాలను, ఆయన ప్రాపంచిక దృక్పథంగా స్వీకరించి ఆచరించిన మార్క్సిజం - లెనినిజం - మావో ఆలోచనా విధానాన్ని ప్రచారం చెయ్యాలన్న లక్ష్యంతో 1978 జులైలో ''తరిమెల నాగిరెడ్డి మెమోరియల్‌ ట్రస్టు' ఏర్పడింది. మార్క్సిజం - లెనినిజం - మావో ఆలోచనా విధానాన్ని సాహిత్య, సాంస్కృతిక, విద్యా సంబంధమైన కార్యకలాపాల ద్వారా తన లక్ష్యానికి అనుగుణంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నది.

ఆ రాత్రి

ఆ రాత్రి సరిహద్దు ప్రాంతంలో మంచుతుపాను చెలరేగింది. కత్తుల్లాంటి మంచు పెళ్లులు చెళ్ళు చెళ్ళున వారి మొహాలకు దారుణంగా కొట్టుకున్నాయి. కాని గత్యంతరం లేదు. తలదాచు కోడానికి చోటులేదు. శీతలం ఎముకలు కొరికేటంత బాధాకరంగా ఉంది.

చెట్లతోపు లోని ఇరుకుబాట బహుచక్కగా ఉంది. నల్లటి చీకటిలో మంచు ఊదాగా కనిపించింది. అతి జాగ్రత్తగా కాలిజాడలను బట్టి నడుస్తుంటే వారి పాదాల కింద మంచు గరగర లాడింది. దుప్పికొమ్ముల వంటి కొమ్మల మీద మెత్తని మంచు పెళ్ళలు కదలకుండా పడి ఉన్నాయి. ఎక్కడో దూరాన చిటారు కొమ్మలనుంచి ¬రుగాలి వీచింది.

కాని ¬రు బయటికి రాగానే తుపాను భూమిని ఆకాశాన్నీ ముంచెత్తి వేస్తూ వారి మీద తన ప్రతాపం చూపెట్టింది.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good