ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

అద్దాల మేడ

''పద్మినీ... పద్మినీ...'' ఎవరో తలుపులు బాదుతున్నారు. ఒళ్ళు విరుచుకుని లేచింది పద్మిని. గడియారం వంక చూచింది. అయిదు కావస్తూంది. పనిమనిషైనా టీ తెచ్చి లేపలేదు.

''పద్మినీ! అబ్బ కాలింగ్‌ బెల్‌ పెట్టించవమ్మా అంటే వినదుకదా.'' బయట గొణుగుడు వినిపించింది. త్వరగా వెళ్ళి తలుపులు తీసింది. నిండుగా వేడిదుస్తులు వేసుకున్న స్త్రీతోపాటు చల్లని ఈదరగాలి లోపలికి వచ్చింది. వెంటనే తులుపులు మూసింది పద్మిని.

''మీరా కోమలగారూ! మీవారేరీ?''

''రామేశ్వరము వెళ్ళినా శనేశ్వరము తప్పదని, సముద్రాలు దాటివచ్చినా పేకాటరాయుళ్ళకు కరువులేదు. ఈ రోజు శనివారము బడి లేదుగా పారాయణము జరుగుతూంది. నువ్వు వస్తే అలా పోస్టాఫీసువైపు వెళ్ళి ఉత్తరాలు వచ్చాయేమో చూద్దామని వచ్చాను.''

''నేను పడుకోందే పిల్లలు పడుకోరని, అలా నడుము వాల్చాను. నిదుర పట్టేసింది. కూర్చోండి. ఆంచీ! (అమ్మాయీ)'' అని పిలిచింది. ఓ పదహారేళ్ళ కన్య చక్కని సిల్కు పువ్వుల గౌను వేసుకుని, కాల్ళకు బోటు ఆకారములో నున్న బూట్లు ధరించి తలకు చుక్కల బట్ట కట్టుకుని వచ్చింది.

''తరాల్లే మెహెతే! (పిలిచారా అమ్మగారూ?)''

''ఉలత్‌యినా ఆంచి. (రెండు కాఫీలు తే)'' అన్నది. అమ్మాయి వెళ్ళిపోయింది.....

పేజీలు : 187

Write a review

Note: HTML is not translated!
Bad           Good