తోలుముక్కపై ఏ పదార్ధంతో రాయబడ్డాయో తెలియని విధంగా నల్లటి రంగులో చిన్న చిన్న అక్షరాలు వున్నాయి. చూడటానికి తెలుగులాగే వున్నాయి. కానీ తెలుగు కాదు. చాలా ప్రాచీన కాలానికి చెందిన ఆంధ్రభాష కావచ్చు. మధ్యమధ్యలో కొన్ని అక్షరాలు ఎగిరిపోయి వున్నాయి. ప్రసన్న హనుమ ఒక్కొక్క అక్షరాన్ని రాసుకుంటూ మధ్యమధ్యలో తనముందున్న పురాతన గ్రంధాలను పరిశీలిస్తూ ఒక్కొక్క పదాన్ని డీకోడ్‌ చేసుకుంటూ వస్తున్నాడు. దాదాపు అయిపోవచ్చింది. చివరికి తోలుముక్కలో వున్న మాటలు సారాంశాన్ని ఇలా తిరగరాశాడు ప్రసన్న హనుమ.

క్రీస్తుశకం 1565 సంవత్సరం...... జనవరి 27 శనివారం రాసినవాడు విజయనగర సామ్రాజ్య రాజాధిరాజు శ్రీశ్రీశ్రీ అళియ రామరాయ రాజేంద్రుని అపారసైనిక సంపదలోని ఓ సైనికుడైన తిమ్మయ్య. అది 1565 జనవరి 23 మంగళవారం.... క్రీస్తుశకం..... రాక్షసనౌర్‌ వద్ద ఆంధ్ర మహాసైన్యానికి, యవన సైన్యానికి మహా సంగ్రామం జరిగింది. సొంత కుమారుడైన పరాను మోసంవల్ల రామరాయ ప్రభువు కంఠం తెగి నేలనపడింది. ప్రభువులవారు నేలకూలడంతో వీరాధివీరులైన ఆంధ్రా సైనికులు తేజం అడుగంటింది. అదే సమయంలో సుల్తానుల సైన్యం విజృంభించింది. ఆంధ్రాసైన్యం కకావికలమైపోయింది. కార్చిచ్చులాంటి యవన సైన్యం లక్షలాది ఆంధ్రా వీరుల కుత్తుకలు మోసోపాయంతో ఖండించింది.

ప్రాణాలు అరచేత పెట్టుకుని కొందరు సైనికులు పారిపోయారు. వారిలో నేనొకడ్ని, ఒక అద్భుత ఘటన అప్పుడే జరిగింది. మరణించిన మహావీరుల ఆంధ్ర సైనికుల ఆత్మలు జరిగిన మోసానికి రగిలిపోయాయి. అసంతృప్తికి, ద్వేషానికి తీవ్రంగా లోనైనాయి. పిండప్రదానానికి, సంస్కార, కర్మలు జరిగే అవకాశం లేనందున ఆ సూక్ష్మ శరీరాలు పైశాచిక రూపుదాల్చాయి. అన్ని ఆత్మలు కలిసి ఒక రాక్షసాత్మగా మారాయి. ఒక మహాక్షుద్రశక్తి ప్రాణం పోసుకుంది. అది రక్తదాహంతో దొరికిన ప్రతిజీవి మీదాపడి విరుచుకుతినబోయింది.

పై సన్నివేశం ఎంతో ఉత్సుకతను కలిగించేలా వ్రాసిన శ్రీ సూర్యదేవర రామ్‌మోహనరావు గారి 'ఆత్మగమనం' నవల లోనిది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good