న్యాయమైన రోజు పనికి

న్యాయమైన రోజు కూలి1

యిది గత యాభై సంవత్సరాలుగా ఇంగ్లీషు కార్మికవర్గ ఉద్యమ నినాదం. 1824లో సంఘాలను గురించిన అపకీర్తికరమైన సంఘటితమయే చట్టాలు రద్దుచేయబడిన తర్వాత ట్రేడ్‌ యూనియన్లు పెరుగుతున్న కాలంలో యిది బాగా ఉపయోగపడింది. యశోదీప్తమైన చార్టిస్టు ఉద్యమ కాలంలో, ఇంగ్లీషు కార్మికులు యూరపియన్‌ కార్మికవర్గపు అగ్రభాగాన నడిచినప్పుడు, యిది యింకా బాగా ఉపయోగపడింది. కానీ, కాలం యాబై ఏండ్ల క్రితం, అంతెందుకు ముప్పై యేండ్ల క్రితం గడుస్తున్నది కూడా, వాంఛనీయమూ, అవసరమూ అయిన యెన్నో విషయాలు ఇప్పుడు పాతబడిపోయాయి. అవి పూర్తిగా అసందర్భం అయ్యాయి. ఈ పాత సంప్రదాయ సన్నుతమైన నినాదం కూడా వాటిలో చేరుతుందా?

న్యామైన రోజు పనికి న్యాయమైన రోజు కూలా? మరి, న్యామైన రోజు పనియేది? న్యామైన రోజు కూలి యేది? యే నియమాలతో ఆధునిక సమాజం ఉనికిలో ఉన్నదో తన్ను తాను అభివృద్ధి చేసుకుంటున్నదో, ఆ నియమాలచేత యివి యెలా నిర్ణయింపబడతాయి? ఈప్రశ్నకు జవాబు కొరకు మనం నీతిశాస్త్రంలోన గానీ, న్యాయశాస్త్రంలో గానీ, మానవతా భావంలో గానీ, న్యాయ దృష్టిలో గానీ, చివరకు ధర్మబుద్ధితో గానీ చూడకూడదు. నైతికంగా న్యాయమైనది, న్యాయశాస్త్ర దృష్ట్యా న్యాయమైనది కూడా, సాంఘికంగా న్యాయం కాకపోవచ్చు....

పేజీలు :62

Write a review

Note: HTML is not translated!
Bad           Good