మన సమాజం కుళ్ళిపోయింది. ఆ కుళ్ళు మన జీవితాల్లోని అన్ని అంశాల్లోకీ, మన యూనివర్సిటీల్లోకీ కూడా వ్యాపించింది. మేము చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. గొంతులెత్తి నిరసన స్వరాలను విన్పించాం. మా నిరసనలు అరణ్య రోదనలయ్యాయి. ఊరేగింపులై కదిలాం. పోలీసులను మాపై ప్రయోగించి భగ్నం చేశారు. మా ఆగ్రహం హింసాత్మకంగా బద్దలయినప్పుడు, అతిదారుణమైన హింసతో దాన్ని అణిచివేశారు. మాకు మేమే సంఘటితమై, హింసకు ప్రతిహింసతో జవాబివ్వటం తప్ప మాకింకొక మార్గమేమున్నది? - జార్జిరెడ్డి

ఈ పుస్తకంలో దాదాపు యాభైకి పైగా వ్యాసాలున్నాయి. ప్రతి ఒక్కరి జ్ఞాపకాలలో వారి వారి హయాంలో జరిగిన సంఘటనలు, సందర్భాలు, ఉద్యమాలు అవి సృష్టించిన చైతన్య కెరటాలు, దృష్టికోణాలు అన్నీ కళ్లకు కట్టినట్లుగా కన్పిస్తాయి. ఓయూ చరిత్రను మౌఖిక భాషలో ఒక్కొక్కరి అనుభవాల జ్ఞాపకాల దొంతర్లతో ఆవిష్కరించటానికి ఈ పుస్తకం కూర్పుకు పూనుకోవడం హర్షించదగినది.

పేజీలు : 272

Write a review

Note: HTML is not translated!
Bad           Good