ఆ యా సందర్భాల్లో అంపశయ్య నవీన్‌ రచించిన సాహిత్య వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. దీంట్లో ప్రజాకవి కాళోజీ, తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య, ప్రఖ్యాత కథకుడు బుచ్చిబాబు మొదలైన వారి రచనల్ని గూర్చిన విశ్లేషణలు, పాఠకులకు ఆ రచయితల రచనల్లోని వైశిష్ట్యాన్ని తెలియజేస్తాయి.

కొందరు వర్థమాన రచయితలకు నవీన్‌ రచించిన ముందు మాటలు కూడా ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి.

నవీన్‌ అనేక పత్రికల్లో వందకు పైగా పుస్తక సమీక్షలు చేశారు. వాటిల్లో కొన్నింటిని ఈ సంపుటిలో చేర్చాము.

కథకుడుగా, నవలాకారుడుగా ప్రసిద్ధి గాంచిన నవీన్‌ ఒక విమర్శకుడిగా కూడా ఇలాంటి అనేక వ్యాసాల ద్వారా నిరూపించుకున్నారు. ఇది అంపశయ్య నవీన్‌ ప్రచురిస్తున్న నాల్గవ సాహిత్య వ్యాసాల సంపుటి.

పేజీలు : 310

Write a review

Note: HTML is not translated!
Bad           Good