కష్టజీవికి రెండు వైపులా అండదండగా నిలిచేవాడే నేటి కవి అని ఆధునిక కవికి అధునాతన నిర్వచనం యిచ్చిన శ్రీశ్రీ భౌతికంగా మన నుండి దూరమై అప్పుడే 24 సంవత్సరాలు పూర్తయింది. 2010 ఏప్రిల్‌ 30వ తేదీకి ఆయన పుట్టి నూరు సంవత్సరాలవుతుంది. మూడు సంవత్సరాల ముందుగానే శ్రీశ్రీ శతజయంతి గురించిన నిరంతరాయ కార్యక్రమ పథక రచన ఒక వైపు సాగుతోంది. శ్రీశ్రీ కవిత్వాభిమానులూ, భావోద్వేగ సన్నిహితులూ, లక్ష్య సాధనావేశితులూ కలసి శ్రీశ్రీని నూతన తరాలకు ఎంతగా పరిచయం చేస్తే అంతగా తలపెట్టిన కార్యం నెరవేరినట్టు.

తెలుగు కవిత్వాన్ని విప్లవీకరించినవాడు శ్రీశ్రీ. విప్లవాన్ని కవిత్వీకరించి తెలుగు జాతి జనులు పాడుకునే సంగీతంలా మార్చినవాడు శ్రీశ్రీ.

పేజీలు : 47

Write a review

Note: HTML is not translated!
Bad           Good