తిరుగుబాటు తుపాకి తుపాను కాన్పులు
''సారసలోచనలున్న చోటికి ఖోరున లాతివారు చొరబోయినచో రసభంగ'' మవుతుందని అని అన్న రామరాజభూషణుని ('వసుచరిత్ర'కర్త) శ్రీశ్రీ అనుకరించాడో లేదో మనకు తెలియదుగాని, స్మశానాల వంటి నిఘంటువులకి నిప్పుపెట్టి, అపూర్వమూ మహోజ్వలమైన కవితను రాసేందుకు అనువైన, స్వతస్సిద్ధమైన, మేఘ గంభీరశైలిని తాను సృష్టించుకొనే ప్రయత్నంలో సర్రియలిస్టు శ్రీశ్రీ నిమగ్నమై వున్నాడని, ఈ ఊహాత్మక సంఘటన మనకు విశదపరుస్తుంది. (''ఎన్నాళ్లు ఇంకా'' - ''ఖడ్గసృష్టి''- రచన చూడండి.) ప్రతిభావ్యుత్పత్తుల్ని సమాన నిష్పత్తిలో మేళవించుకొన్న వొహ యువక మేధావి, అనూచానంగా వొస్తున్న ఛందో బందోబస్తుల్ని ఛట్పట్ మని తెంచి, బానిస సంకెళ్ళవంటి వ్యాకరణ నియమాల్ని బదాబదల్ గావించి, సృజనాత్మక కళా వైదగ్ధ్యంతో వొహ అపూర్వ సాహితీ రీతికి నాందీవాక్యం పలికేందుకు ఈ సర్రియలిస్టు కవితలో మనకు సాక్షాత్కరిస్తుంది.
పేజీలు : 63