సామాన్యంగా కథ నడిచి అద్భుతంగా, పాఠకుడు ఊహించని విధంగా ముగిసినపుడు దానికి 'ఓహెన్రీ' ఎండింగ్‌, అని ఒక జాతీయ మేర్పడి పోయేంతగా గొప్ప కథను ముగించేవాడు ఓ.హెన్రీ అనే కథకుడు.

    అలా కవిత్వంలో 'శ్రీశ్రీ చివరి చరణాలు' అనాలనిపిస్తుంది. అద్భుతంగా ఖండికలు ముగిసినపుడు. అందరికీ తెలిసిన అద్భుతమయిన ముగింపు 

    ''ప్రపంచమొక పద్మవ్యూహం. / కవిత్వమొక తీరని దాహం.''

    చాలా మంది పండితభిషక్కులు, 'మహా ప్రస్థానంలో ఏముంది-కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళతప్ప, అని విమర్శించే విమర్శకులు, ''బుక్కులు'' అనే గీతానికి ఈ చివరి రెండు చరణాలు ప్రాణం అన్న విషయం మరచిపోతారు.

    (మనస్సులోగాదు, మనకు శ్రీశ్రీ ని తేలికచేసి చెప్పాలనే పాక్షిక దృష్టివల్ల. అందుకే అన్నాడు మరి చలం, ''స్వయంగా చదవండి. చదివిన తరువాత శ్రీశ్రీని చూడాలనిపిస్తే, స్వయంగా చూడండి ఎవరి అభిప్రాయమూ అడుగకండి. ముఖ్యం...'' తరువాత చలం ఏ రాశాడో నేను చెప్పను. మీరే మహాప్రస్థానం స్వంతంగా కొనుక్కొని చదువుకోండి.)

    సాహిత్యంలో సినిమాల ఊసుఎత్తితే ఈ మధ్యనేకొందరు సాహిత్యం మైలపడి పోతున్నదని ఉతికి ఆరవేసుకున్నారు. కాని నాకు తప్పడంలేదు. నేను విశేషించి చెప్పలేని శ్రీశ్రీ కవిత&ంలోని వలువలకు ఒక సినిమాని ఉదహరించడం:

    ''నిప్పులు చిమ్ముకుంటూ / నింగికి నేనెగిరిపోతే / నిబిడాశ్చర్యంతో వీరు

    నెత్తురు కక్కుకుంటూ / నేలకు నే రాలిపోతే / నిర్దాక్షిణ్యంగా వీరే''

    అన్న 'ఆ:' అనేగీతం, 'బుక్కులు'లోని చివరి రెండు చరణాలు చదివినప్పుడల్లా 'ప్యాసా' అనే చిత్రం గుర్తుకొస్తుంది. అలాగే ఆ చిత్రం చూసినా ఆవాక్యాలు గుర్తుకొస్తాయి. నేననుకొంటాఉ, నాలాంటి సామాన్య పాఠకునికి, నాలాంటి సామాన్యునికి సినీ .....కు ఈ చరణాల్లోని భావం, చాలా ఐడింటిటీ చేసి చూపగలిగానేమో ఈ చిత్రాన్ని ఉదహరించి అని.

Write a review

Note: HTML is not translated!
Bad           Good