Rs.170.00
In Stock
-
+
నక్సల్బరీ తొలి దశలోని విప్లవోద్యమ నిర్మాణ, రాజకీయ పోరాటాల గురించిన వ్యాసాలు ఇవి. కమ్యూనిస్టు ఉద్యమంలో నక్సల్బరీ ప్రవేశ పెట్టిన ప్రజా సంచలనాలను లిబరేషన్ పత్రిక అక్షరబద్ధం చేసింది. నక్సల్బరీ ఒక రాజకీయ పంథాగా నిర్మాణమైన క్రమాన్ని, దాని చుట్టూ దేశవ్యాప్తంగా విప్లవ శక్తులు సమీకృతమైన తీరునూ ఈ వ్యాసాల్లో చూడవచ్చు. ఒక రకంగా నక్సల్బరీ కాలంనాటి... అంటే 1967-72 మధ్య కాలపు విప్లవోద్యమ అధికారిక రచనలివి. ఆ రోజుల్లోని విప్లవోద్యమ తీవ్రత, రాజకీయ అభినివేశం, విప్లవం పట్ల అచంచల విశ్వాసం ఇందులో కనిపిస్తాయి. నక్సల్బరీ పంథాలో విప్లవోద్య వ్యూహం, ఎత్తుగడలు రూపొంది అమలులోకి ఎలా వచ్చాయో చూడవచ్చు.
పేజీలు : 318