పరుసవేది శ్రీశ్రీ

భావకవితాకాశంలో ప్రభవ ప్రవాసి

అభ్యుదయావేశంలో భిక్షువర్షీయసీ అంతేవాసి

సదసత్సంశయాల నిర్వికల్ప సన్యాసి

ప్రాసక్రీడల నివాసి, లిమరిక్కుల దుబాసి

ఒక తరాన్ని కవితామయం చేసిన పరుసవేది !


అరాచకం వచ్చి మీద విరుచుకుపడ్డా

అధివాస్తవికతచేత క్రూరంగా కొరకబడ్డా

ఫ్రాయిడ్‌ గాలం కంఠంలో అడ్డంపడ్డా

జననిర్వేదంలో మార్క్సును తలచిన జ్ఞాని !


జనసాన్నిహిత్యంలో జగన్నాథ రథచక్రాలు

సొంతవిభాషలో స్వవచన విఘాతాలు

తన్నుతాను సంబాళించుకునే హస్తవాసి

విప్లవయుగంలో మైమరచిన కవితాపిపాసి !


దగాపడిన తమ్ముళ్ళు దారిపక్క ముసిల్ది

గుర్రం చచ్చిన జట్కావాలా కథలవెతల కోనేటిరావ్‌

నిజంగానే నిండుహర్షం వహించేదాకా

శ్రీశ్రీ మహాప్రస్థానం జాతిని ఆవహిస్తుంది !

పేజీలు : 39

Write a review

Note: HTML is not translated!
Bad           Good