నా మాస్కో యాత్రలో ప్రప్రథమంగా నాకు ఆశ్చర్యం కలిగించింది ఒక సోవియట్ విమానం. అంతకుముందు సోవియట్ నావలు చూశాను. రష్యన్ సిగరెట్లు కాల్చాను. కాని సోవియట్ విమానాలు మాత్రం చూడలేదు. అందులో ప్రయాణం చెయ్యనూ లేదు. అందుచేత హెల్సింకీ విమానాశ్రయంలో యు.యస్.యస్.ఆర్.కు రష్యన్ పర్యాయపదమైన సి.సి.సి.పి. అనే అక్షరాలతో సుత్తీ కొడవలి చిత్రించిన ఎర్ర జెండాతో ఒక విమానం చూసినప్పుడు మేమందులో రష్యాకు ప్రయాణం చెయ్యబోతున్నామని తెలుసుకొన్నప్పుడు నేను పరవశత్వం పొందాను. ఆ ప్రయాణం యెంత అద్భుతంగా ఉంది! మేము హెల్సింకీలో బయలుదేరి మద్యలో లెనిన్గ్రాడ్లో కొంతసేపు ఆగి రాత్రి వేళకు మాస్కో చేరుకున్నాము.
బాహ్యప్రపంచం నుండి రష్యాను వేరుచేసే ఉక్కు తెరను గురించి అనేక ప్రచారాలు విన్నాం. కాని మాకు మాత్రం నేషనల్ హూటల్లో వెల్వెట్ తెరలు, ప్రదర్శనాలయాల్లో యవనికలు తప్ప మరే తెరలూ కన్పించలేదని మనవిచేస్తున్నాను. ఈ 'ఉక్కు తెర' అనేది వట్టిబూటకం అంతే.
పేజీలు : 72