శ్రీశ్రీ చేసిన నూతన సృష్టి

సమకాలీన సమాజంలో ప్రజల ఆమోదముద్ర పొందలేని వాడు తన కాలంలోనే కాదు, ముందుకాలంలోకూడా గొప్ప కవిగా చలామణీ కాలేడు. సమకాలీన ప్రజల ఆమోదం పొందడమంటే అందరు పాఠకులచేత ఏకగ్రీవంగా మంచి కవి అని ప్రశంసించబడడం కాకపోవచ్చు. కాని అందరు పాఠకులచేత చర్చించబడడం తప్పనిసరిగా అవసరం. ఆ కవిని పాఠకులు ఆమోదించకపోవచ్చు కాని అతనిని గురించి చర్చించుకోవాలి. ఆవిధంగా ఆమోదం పొందినవాడే ముందుతరాలలో కూడా నిలుస్తాడు. 'ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే గదా' అనే మాట మెచ్చడం అంటే కేవలం పండితుల మెప్పు అనే అర్థం వున్న యుగంలో చెప్పినమాట. పండితుల మధ్యగల యీర్ష్యాదులు అడ్డువచ్చి మెప్పుదల లభించకపోవచ్చు. నేటి ప్రజాస్వామ్యయుగంలో సహృదయులైన లక్షలాది పాఠకుల విషయంలో యీ సమస్య ఉదయించదు. సమకాలీనుల చేత పూర్తిగా నిరాకరింపబడి మునుముందు ఎప్పుడో తన కవితలో అనర్ఘరత్నాలు బయటపడతాయనుకోవడం కేవలం భ్రమ. సమకాలీనులచేత ఆ విధంగా ఆమోదింపబడినవారిలో అగ్రేసరుడు శ్రీశ్రీ.

పేజీలు : 31

Write a review

Note: HTML is not translated!
Bad           Good