సెక్యులారిజం అంటే ప్రభుత్వానికి మతం లేదు అని అర్థం. అంతేగాని ప్రభుత్వం సర్వమత సమానత్వాన్ని పాటిస్తుంది అనే మాట పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు గణాంకాల్లోకి అనువాదమైతే ఆయా మతాల దామాషా ఆధిపత్యం ప్రభుత్వం పైన ఉంటుందని తేలుతుంది. కనుక సారాంశంలో అది మెజారిటీ మత ఆధిపత్యం అవుతుంది. అందుకే మనది హిందుత్వ రాజ్యంగా మారిపోయింది. - వరవరరావు

    కవికి సమాజంతో సామరస్యం ఎప్పుడూ కుదరదు. కుదిరిందంటే అతనిలోని సృజనాత్మకత చచ్చి వూర్కొంటుంది. సమాజంలో తాను తీసుకురావలసిన మార్పుకోసం కవి అంతర్‌ బహిర్‌ పోరాటం చేయవలసి వుంటుంది. ఏకపక్షంగా బాహిర సమాజంతో పోరాటం చేయటం తగని పని. ముందు తనలో వున్న (తనవారిలో వున్న) లోపాలు సవరించుకుంటే - తనమీద, తనవారి మీద దాష్టీకం చెలాయించే వారి గల్లా పట్టుకొని నిలదీయవచ్చు. ఈ 'ఎరుక' పుష్కలంగా కలిగివున్న వారు ముస్లింవాద కవులు. - దిలావర్‌

    భౌగోళిక ఆధారాలు, జైవిక, ఆధారాల వల్ల టర్కీ, ఇరాన్‌, ఇరాక్‌ ముస్లింలు-జర్మన్‌ దేశస్తుల మాదిరి-ఆర్యులు. జర్మన్‌లేమో మిత్రులు, ముస్లింలేమో శత్రువులా? ఇది ద్వంద్వ నీతి కాదా? వాస్తవానికి వాళ్లు ఆర్య ముస్లింలకు వ్యతిరేకులు కాదు. మూలవాసీ ముస్లింలకు వ్యతిరేకులు. కుల వ్యవస్థలో బానిసలుగా బతికినవారూ, మానవాధములుగా జీవించినవారూ ముస్లింలుగా మారి మానవస్థాయిని పొందడమే బ్రాహ్మణవాదులకు నచ్చలేదు. అందుకే విశ్వాసాల ముసుగులో ముస్లింల మీద జరుగుతున్న హింసా, అమలవుతున్నా నిర్మూలనా కార్యక్రమం పూర్తిగా మూలవాసులకు విరుద్ధమైంది. మూలవాసుల మీద కేంద్రీకరించిన దుర్మార్గమైన బ్రాహ్మణాస్త్రం హిందూత్వం. ఆ విషయాన్ని స్కైబాబ బలంగా ప్రతిపాదిస్తాడు. - జిలుకర శ్రీనివాస్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good