చలసాని ప్రసాద్‌ వ్యక్తిత్వం వలెనే ఆయన వాక్యమూ విలక్షణమైనది. వాక్యం వలెనే సాహిత్యంలో ఆయన చూపిన వర్గపోరాట దృక్పథమూ విభిన్నమైనది. ఆయనలో ప్రగతిశీల సాహిత్య వారసత్వం ఎంత ఉజ్వలంగా ఉన్నదో మొత్తంగా తరతరాల జానపదుల జీవితంలోని సకల ప్రత్యామ్నాయ ఒరవడులూ అంతగానే ఉన్నాయి.  అది తెలుగు సాహిత్యానికే పరిమితమైనది కాదు. ప్రపంచవ్యాప్త ప్రజా, అభ్యుదయ, విప్లవ సంప్రదాయాలకూ చెందింది. సాహిత్యాన్ని ఇంత విశాలమైన జీవన రంగస్థలం మీద చలసాని ప్రసాద్‌ గుర్తించాడు. మానవజాతి సాగించిన చారిత్రక ప్రయాణానికి, అందులోని రప్చర్‌కు, దానికి కారణమైన మానవకర్తృత్వానికి సృజనాత్మక రూపంగా సాహిత్యాన్ని అర్థం చేసుకున్నాడు.

పేజీలు : 615

Write a review

Note: HTML is not translated!
Bad           Good