సిగ్నల్‌ : ప్రపంచ భాషల ప్రసిద్ధ కథలు

మన జీవితాలను రూపొందిపంచేది దేవుడు మాత్రం కాదు. మన తోటివారే. అంటే మనుషులే. ఈ 'మనిషి' అంతటి క్రూరమైన ప్రాణి జగత్తులో మరొకటి లేదు. ఒక తోడేలు మరో తోడేలును ఎప్పుడూ తినదు. కాని మనిషి అలా కాదు. తోటివాణ్ణే తిని త్రేన్చేస్తాడు.'' - సిగ్నల్‌, రష్యన్‌ కథ

''ప్రజలంతా ఎడారి నక్కలకు బయపడతారుగానీ అసలు క్రూరమృగాలు వీళ్ళేనమ్మా! వీళ్ళే'' గొణుక్కుంటూ కూతురి వెంట నడిచాడు స్యాండి. - ఎడారి నక్క మంగోలియన్‌ కథ

''మీరెలా నా పిల్లలో వారు అలాగే! గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతున్న వో అబ్బాయిని అతని స్నేహితులు తీసుకుని ఆశ్రయం కోసం ఇక్కడికి వచ్చారు. ఆకలి, అలసటతో యిప్పటికే సగం చచ్చినట్టున్నారు...'' అంది మళ్లీ -

''ఈ ఒక్క రాత్రి... ఈ క్రిస్‌మస్‌ రాత్రయినా మనం యుద్ధాన్ని మరుద్దాం'' కార్పోరల్‌ను చూస్తూ మళ్ళీ అంది. - చీకట్లో చిరుదీపం, ఆంగ్ల కథ

ఫ్రెంచ్‌లో పుట్టిన కథారూపం, అమెరికన్‌, రష్యన్‌ రచయితల చేతుల్లో పరిపూర్ణంగా రూపుదిద్దుకుని ఓ తిరుగులేని సాహితీ ప్రర్కఇయగా మారింది. ప్రపంచ సాహిత్యంలో అనేకానేక అద్బుతమైన కథలొచ్చాయి. వాటిల్లో కొన్నిటిని ఏర్చికూర్చి ఈ సంకలనంలో చేర్చారు. ఇందులోని కథలు కాలక్షేపం కబుర్లు కావు. గట్టిగా మనస్సును తట్టి, మనల్ని మనం సమీక్షించుకునేలా చేసే ఆప్తవాక్యాలు. జాడ కనిపించకుండా పోతున్న కరుణ, దయ మొదలైన మానవీయ విలువల్ని గుర్తుచేసే చిరుదీపాలు. ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాల్లా ఉండే ఇంత చక్కటి కూర్పుని తెలుగు పాఠకుల ముందుకు తీసుకురావడం రంగనాథ రామచంద్రరావుగారికే సాధ్యం.  -'ఛాయ' కృష్ణమోహన్‌ బాబు

పేజీలు : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good