Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Kavitha 2008

భాషంటే కేవలం ఒక భావానికి మాధ్యమమేనా? ఒక నోటినుంచి మరొక చెవికి, ఒక కలం నుంచి మరొక కంటికి అక్షరాలను అందించే ఆధారమేనా? కాదనుకుంటా. ఒక జాతి ఉనికి నుంచి, మనికి నుంచి వ్యక్తికందిన జీవసంపదను ఇతరులకు పంచే పళ్లెం కూడా. సంస్కృతికి ఆకారం భాష, ఆకారం భాష. ఏదో ఒక ఆవేశంలో, ఒక ప్రత్యేకసందర్భంలో మహాకవి అ..

Rs.100.00

Kavitha 2007

నాకు తెలుసు నాకు తెలుసు నాకు ఖననముండదని, చావుని బతుకుతో సమానం చేసేవాడిని సమాధి చేయడం చాలా కష్టం చావులోనూ బతుకులోనూ బతికే వాణ్ణి సమాధి చేయటం మరీకష్టం నాకు తెలుసు నాకు ఖననముండదని - దానిలాస్టోయిలోవా, బల్గేరియా కవి..

Rs.80.00

Kavitha 2006

మనిషిలోని ఆర్తినీ, మానవ సంబంధాల మద్య సజీవంగా వుండవలసిన ఆర్ద్రతని కళా, సాహిత్యాలు మాత్రమే కంటికి రెప్పలా కాపాడగలవన్నది సాహితీమిత్రుల అచంచల విశ్వాసం. కళలు, సాహిత్యాలను పరిరక్షించుకోవటంతోపాటు అవి మరింతగా, ఫలవంతమయ్యే వాతావరణం సృష్టించడం కోసం ప్రయత్నించటం మనుషులుగా మన అందరి కర్తవ్యం, బాధ్యతా. ..

Rs.80.00

Kavitha 2005

సూటిగా చెప్పడంలో, అందంగా చెప్పడంలో ఎంత సొగసుంటుందో, ఎంత మర్మముంటుందో కవితాత్మకంగా చెప్పడంలో అంతకు మించినర మార్మికత ఉంటుంది. వర్ణవిన్యాసంలోని అనంత వర్ణ విన్యాసాలను అక్షర బద్దం చేసిన కవిమిత్రుల కవితల కదంబం 'కవిత-2005'. వేసవివేళ, వడగాడ్పులొక వంక, మల్లెల గుబాళింపు మరొకవంక. గత సంవత్సరంలో పత్రికలలో..

Rs.75.00

Kavitha 2004

ప్రతి సంవత్సరం తెలుగులో వచ్చే కవితల్లో మేలైనవి ఏరి ఒక పుస్తకంగా పదిలపరిస్తే ఇటు మంచి కవిత్వాన్ని, అటు సామాజిక చలనాన్ని నమోదు చేయవచ్చు. ఏడాదిలో వేల కవితలు వెలువడుతున్న సందర్భంలో ఒక ప్రాతినిధ్య సంకలనం రూపొందించడం చాలా చాలా కష్టమైన పని. ..

Rs.80.00

Jagte Raho

పదపదమంటూ పదాల పడవల మీద పోరాటానికి బయలుదేరిన సాహసికుడితడు ఈ బల్‌ రైఫిల్‌ పదాల స్వరాలలోంచి గుండెలను అమాంతం పేల్చగలడు అన్నింటినీ నిట్టనిలువునా పట్టపగలే కూల్చగలడు అతనొక ఆకాశనీలిమ, అరుణిమలతో ఆవేదనలని, అశ్రువులను ఆసాంతం హరించేందు శివమెత్తిన సాగరం. ఆయన కవిత్వం విప్..

Rs.100.00

Insha Allah

కరువొచ్చిన కాలంలో అరవై నిండాయి నాకు అతి తేలికగా, చొరబడి మారగలన ఇన్షా అల్లాహ్‌! బంధన సంబంధాల్లో అంధుల వలె తచ్చాడుతు అల్లాడడమే బంధువులని చివరివరకు ఇందధమిదె మన బతుకుకు ఇన్షా అల్లాహ్‌!..

Rs.20.00

Hasya Kavitalu

ఈ హాస్య కవితల బీరువా తీస్తే చాలు మనందరి ముఖాలతీరు ఎలుగెత్తు నవ్వుల తేరు కదలాడే చక్రాలపై కటకటలడోలు పలికించు అన్నవరపు జట్కాల బోలు మీ లీలలివే జాజా! జేగురుదొరా! చలేజా లెలెమ్మనే తరువోజ శాసనాల్నీమ్రోల, రా చూడష్టావక్ర వీరా సుడోజాగ్రద్ధీరా! ఈ చెమక్కు నానో వింటే పులినాన..

Rs.50.00

Gandhakuti

నా లోపల ఒక సముద్రం వుందని తెలుసుకానీ అందులో ఇన్ని జలస్తంబాలూ, అనేకానేక తుఫానుల్లో మునిగిపోయిన ఇన్ని మహా నౌకలు, నౌకల్లో ఇన్ని అక్షౌహిణుల సైన్యమూ, లక్షలాది ఈటెలు, కరవాలాలూ, అసంఖ్యాక శిరస్త్రాణాలూ, లోహ కవచాలూ, ద్రవమై వున్నాయని ఇప్పుడే, ఆరుపదుల అనుభవాల అణువిస్ఫోటన జరిగినప్పుడే తెలిసింది ప్రియతమా! ఈ లో..

Rs.75.00

Alvida

కౌముది కవిత్వం వెతికిపట్టి ఇవాళ ఒకచోట పెట్టి చూపిస్తున్న మిత్రుల కృషి విలువైంది. ఆ కవిత్వమంతా వరసగా ఇవాళ చదువుతూంటే - పాతగా పొగలాగ, అనిపించదు. ఆ వాక్యాలకు, పద సంపుటికి, పాతదనం లేదు. పునరుక్తి కాదు. కవిత్వ రహస్యమెరిగిన వ్యక్తి పడే జాగ్రత్త అది. మరీ ముఖ్యంగా 'ఏకాంత', 'ఒక వృక్షం', 'ఇంతకూ నేనెవర్..

Rs.100.00

Bhavani Kavitwam - 1

ఉబలాటంకోసం కాక గుండె ఉధృతితో రాస్తున్న సీరియస్‌ కవయిత్రి భవానీదేవి. - డా.ఎన్‌.గోపి మనిషి మనిషిగా బ్రతకాలనేది కవయిత్రి అంతర్గత కాంక్ష. కళ్ళ తడి కోసం కాక గుండె తడి కోసం ఆమె తపన. - ఆచార్య తిరుమల భవానీదేవి యీ తరం స్త్రీవాద కవిత్వంలో స్ఫుటమైన, బలమైన గొంతు - రామమోహన్‌రాయ్‌ భవానీదేవి నానీల..

Rs.450.00

Matsuvo Basho Haiku ..

మత్సువొ బషో (1644-1694) జపాన్ సాహిత్యంలో అగ్రశ్రేణి సాహిత్యకారుడు, కవి. జీవితమంతా తీవ్ర సౌందర్యోపాసకుడిగా జీవించాడు. తన జీవితకాలంలో ఐదుసార్లు జపానంతా పర్యటించాడు. ఆ పర్యటనల్లో తన అనుభవాల్నీ, అనుభూతినీ యాత్రావర్ణనలుగా రాసిపెట్టాడు. అలాగే అప్పుడప్పుడూ తన ఆనందాన్నీ, దుఃఖాన్నీ కూడా క..

Rs.90.00

Vajraudham

నిరంకుశ నిజాం గుండెల్లో ''ఖబడ్దార్‌! ఖబడ్దార్‌!! నైజాం పాఇదుషా హే!'' అంటూ తెలంగాణా జనగర్జన మార్మ్రోగే కవితా సంపుటి 'వజ్రాయుధం' ..

Rs.30.00

Srujanakanti

''నేనిప్పుడు అక్షరమై లేస్తున్నాను నీ తరం ఆశ్చర్యపడేలా నా తరంలో శిరసిత్తుకున్నాను ఇక అక్షరమే నా అస్తిత్వం''  - (అక్షరం నా అస్తిత్వం) ''వివాహమా! ఎంత పనిచేశావు నన్ను పుట్టింటికి అతిధిని చేశావు'' - ..

Rs.350.00

Puli Panja

కళాప్రపూర్ణ పురిపండా అప్పలస్వామి శత జయంతి సంవత్సర ప్రచురణ 'పులిపంజా'..

Rs.40.00

Damera Kavita Sarvas..

ఈ పుస్తకంలో దామెర కోరస్‌, నెత్తుటి వెన్నెల, కొర్రాయి, జయ హే తెలంగాణా! అసలు ముఖం తదితర భాగాలున్నాయి. ..

Rs.400.00

Mulki Muslim Sahitya..

దాదాపు అన్ని సమాజాలలో మెజారిటీ మత భావజాలం ఆవరించి ఉంటోంది. ప్రత్యక్షంగా బైటపడని చోట కూడా పరోక్షంగా దాని ప్రభావం ఎంతో ఉంటుంది. అ లాంటి ఈ లోకంలో ఒక మైనారిటీ వాయిస్ కు ... అందులోనూ దేశ విభజనాభారాన్నీ, నిందల్నీ, గోబెల్ ప్రచారాల్నీ అకారణంగా మోస్తున్న ముస్లింల నుంచి వస్తున్న సాహిత్యాని..

Rs.65.00

Vemana Bodha

వేమన బోధ - జి.వి. సుబ్రహ్మణ్యం ''తిక్కనగాని, వేమనగాని, గురజాడగాని రాసిందంతా ఆద్యంతం నాటకం. నాటకంలోనే కవిత్వం పరాకాష్ఠ అందుకుంటుంది. వేమన్న రాసిన ప్రతి పద్యం ఒక నాటకం. ఆ మాటకొస్తే వేమన్న జీవితమంతా ఒక నాటకమే. ఆటవెలది ఛందస్సు అతడి నాటకరంగం. నాలుగు పాదాలలో ''విశ్వదాభిరామ వ..

Rs.185.00

Udyamame Oopiriga

అరకెత్తిన రైతన్న అందం చూస్తే శిలువెక్కిన జీసెస్ లా దేశానికి ప్రపంచానికి ఏదో బోధన నివేదన అర్చన *** ప్రతి అణువు బురద బువ్వలా అందంగా ఉంటుంది. చదునైన భూమిపైకి నెలవంకలా గంగమ్మతల్లి ఆబగా చూస్తూ గట్టుకు రంధ్రం వేస్తుంది. చిక్కుడు పాదులా అంతా ఆక్రమిస్తుంది. అర్థరాత్రి వెన్నెలవోలే అందరికి అన్నం పెట్టే అన్నద..

Rs.30.00

Shatakamanjari

తెలుగు శతకాలలో ఎంతో విలక్షణత, వైవిధ్యం , విశిష్టత కనిపిస్తుంది. ఈ శతక వాజ్మయం ఒకగని. దానిని త్రవ్వే కొద్దీ మణులు మాణిక్యాలు బయటపడతాయి. ప్రత్యేక లక్షణాలు మెరుపులు అద్బుతంగా ప్రదర్సితమవుతాయి. ఇలాంటి శతకాలను కొన్నింటిని అధ్యయనం చేసి వాని ప్రత్యేకతను తెలుగు భాష విశిష్టతను తెలుగు భాష ప్రేమికులు తెలుసుక..

Rs.200.00