తెలుగులో వందల సంఖ్యలో శతకాలున్నాయి. వాటిలో వేమన శతకము, సుమతీ శతకము, దాశరథి శతకము, కృష్ణ శతకము, భాస్కర శతకము, శ్రీకాకుళాంధ్ర శతకము, నృసింహ శతకము మొదలుగునవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ శతకాలలో నీతి శతకాలు, భక్తి ప్రబోధక శతకాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాక సామాజిక స్థితిగతుల్ని తెలియజేసేవి, సామాజిక రుగ్మతల్ని ఎత్తిచూపేవి, మూఢాచారాల్ని ఖండించేవి ఉన్నాయి.

తెలుగు నీతి శతకాలలో వేమనపద్యాల తర్వాత బాగవ్యాప్తిలో ఉన్న శతకం సుమతీ శతకం; ధారాళమైన నీతులు గల కందపద్యాల శతకమిది. ఆ చెప్పే విధానంలో, పదాల కూర్పలో సూటిదనం ఉంటుంది. ఆదేశిస్తున్న ధోరణిలో చెబుతున్నట్లుగా ఇందలి నీతి పద్యాలుంటాయి. ఈ శతక కవి బద్దెన (అదే భద్రభూపాలుడు) ఆనాటి సమాజపు కట్టుబాట్లకు లోబడి నీతులను చెబుతున్నట్లుగా కొన్ని పద్యాలను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా స్త్రీలరంగా స్వేచ్ఛ ఇచ్చి నీతులను చెబుతున్నట్లుగా ఈనాటి వారికి అనిపించదు. అక్కడక్కడ కుల ర్పస్తావనలున్నాయి. ఆయా కులాలవారికి అందరికీ పూర్తిగా నచ్చినా - నచ్చకున్నా నాటి సామాజిక నైతిక పద్దతుల్ని తెలుసుకోవడానికీ, ఇప్పటి కాలమాన పరిస్థితులతో బేరీజువేసి, చూసుకోడానికి ఈ శతకం ఉపయోగపడుతుంది.

ఈ శతక పద్యాలు పిల్లలు చదవడం ద్వారా భాషాజ్ఞానం పెంపొందటంతోపాటు, మానసిక వికాసం కలుగుతుంది.

కవి పండితులు డా|| రామడుగు వెంకటేశ్వరశర్మ ఈ సుమతీ శతక పద్యాలకు సరళ సుందరంగా తాత్పర్యాలను రచించారు.

పేజీలు : 36

Write a review

Note: HTML is not translated!
Bad           Good