ప్రవక్త అనేది యూదీయ-క్రైస్తవ-ఇస్లామీయ పదం. ప్రవక్త అంటే పూజారి కానివాడు. వేల ఏళ్ళ అసీరియన్‌-బేబిలోనియన్‌-సుమేరియన్‌ పూజారుల మీద నిరసనగా పాతనిబంధన ప్రక్తలు ప్రభవించారు. పూజారి దృష్టి వ్యవస్థని ఏర్పాటు చెయ్యడం మీద ఉంటుంది. మనిషికీ, పరలోకానికీ నడుమ అతడు మధ్యవర్తిగా పనిచేస్తాడు. కాని ప్రవక్త మనుషుల హృదయాల్ని నేరుగా తడతాడు. 'తట్టండి, తెరుచుకుంటుంది' అంటాడతడు.

ది ప్రొఫెట్‌ అంటే తెలుగులో 'ప్రవక్త' అనే అర్థం.

నౌకాగమనం :

'అల్‌ముస్తఫా' అని పేరు,

అందరి వాడతడు,

సకలజనుల ప్రేమకు పాత్రుడు.

ఆత్మీయ ప్రేమకు ఎంపికైన విశిష్టుడు.


తాను పుట్టిపెరిగిన

తల్లిఒడిలాంటి తన దీవికి

తిరిగి తీసుకెళ్లే నౌక కోసం

పన్నెండేళ్ళుగా నిరీక్షిస్తున్నాడీ

'అర్ఫలీస్‌' నగరంలో...

తన కాలానికే తానే తొలిపొద్దుగా...

పేజీలు : 166

Write a review

Note: HTML is not translated!
Bad           Good