Rs.60.00
Out Of Stock
-
+
హాస్యమంటే నవ్వించడమే కాదు. జీవితంలోని విషాదాన్ని ఎగరేసి నవ్వడం. కన్నీళ్ళలో ఏకకాలంలో ఆనంద విషాదాలు రెండూ వున్నాయి. ద్వ్యర్థికావ్యం కన్నీరు. నిజానికి ఈ సంపుటిలోని ప్రతి కవితా ద్వ్యర్థి కవితే. అందుకే
''కన్నీటి బిందువుని మించిన కావ్యం నాకు కనపళ్ళేదు'' అని అనగలిగాడు భరణి. భరణి అనుభవ కవి. కవితలన్నీ అతడు మాట్లాడుతున్నట్టే ఉంటాయి. కాలరు బిగించుకుని మాట్లాడడు. కలలు వెదజల్లుతున్నట్టు, కన్నీళ్ళు ఆరబోసుకున్నట్టు మాట్లాడతాడు. ప్రతి కవిత కిందా అది రాసిన నేపథ్యం ఎందుకబ్బా అనిపిస్తుంది పఠితకి. ఇది చెప్పకపోతే ఇంకోరకంగా అర్థం చేసుకుంటారేమో అన్న భయం కాబోలు భరణికి. నిజానికి ఆ భయం అక్కరలేదు. అడుగు కనిపించేంత సెలయేళ్ళీ కవితలు. - ఆచార్య ఎన్.గోపి. వైస్ ఛాన్సలర్, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం