"గీతాంజలి"!
-అనగానే గురుదేవుడు రవీంద్రనాథ్ టాగోర్ జ్ఞాపకం వస్తారు! టాగోర్‌కు పర్యాయపదం "గీతాంజలి"! మరి, ఆ మహాగ్రంథం ఆయనకు నోబెల్ సాహిత్య బహుమతిని, భారతదేశానికి తొలినోబెల్ బహూకృతిని ప్రసాదించె!

"గీతాంజలి"ని ప్రపంచంలోని ప్రముఖ భాషలన్నింటిలోకి అనువదించారు. తెలుగులోకి కూడా కొందరు తర్జుమా చేశారు. వారిలో "పద్మభూషణ్" కొంగర జగ్గయ్య కూడా ఒకరు.

కాగా, ఇప్పుడు వల్లూరుపల్లి లక్ష్మిగారు "గీతాంజలి"ని తెలుగులో తనదైన శైలిలో అనువదించారు.

శైలి సర్వజన సుబోధకం; సామాన్యునికి సయితం సులభ గ్రాహ్యం; మాతృక జిగి, బిగి సడలలేదు. లక్ష్మిగారు చెయ్యితిరిగిన రచయిత్రి. ఆమె "చుక్కలసీమే మిగిలింది" అన్న కథల సంపుటి చక్కని కుటుంబ కథా కదంబం. మరో కథల సంపుటి "మేఘన".

ఈ విదుషీమణి కలం నుంచి మరెన్నో "మణిపూసలు" వెలువడాలని నా ఆకాంక్ష.

ఆమె తెలుగు "గీతాంజలి"కి నా ప్రశంసాంజలి.
- తుర్లపాటి కుటుంబరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good