వొస్తోంది చీకటి

వొస్తోంది, వొస్తోంది చీకటి

క్షుత్పీడిత మృగం మల్లే

దూర యెడారి దారులంట

నిశ్శబ్దంగా నడిచి వొస్తోంది !

కొన వూపిరితో కదిలే

రక్త సిక్త సంధ్యా కాంతికేసి

ఆశతో, ఆకలి క్రోధంతో

కదిలి వొస్తోంది, వొస్తోంది !

కారడవుల్లో బహు పుష్ప శోభనం

కాలధరణికి మధు స్వప్న సౌరభం

రగిల్చ  వొస్తోంది, వొస్తోంది

యవనవ్వన హృదంతరాళాల్లో

కంపిత కామన జ్వాలావేశం !

కాని, యేమిటిది నాలోంచి

అణచుకో లేని వొణుకు

భీరు మనో శీత్కారం...

దేనికి నేనిట్లా

బందీనై చీకట్లో

చీకటి గుప్పెట్లో !

పేజీలు : 205

Write a review

Note: HTML is not translated!
Bad           Good