బౌద్ధం అత్యంత ప్రాచీనమైనది. మార్క్సిజం ఆధునికమైనది. కారల్‌ మార్క్స్‌ బౌద్ధాన్ని అధ్యయనం చేశారోలేదోగాని, అంబేద్కర్‌ రెంటినీ అధ్యయనం చేశారు. రష్యా చైనా విప్లవాలను చూశారు. అయినా ఆయన ఏ కారణం చేతనో బౌద్ధం వైపే నిలిచారు. ''బుద్ధ అండ్‌ కారల్‌మార్క్స్‌'' అని రెండు వ్యాసాలు రాశారు అంబేద్కర్‌. వాటిని మార్క్సిస్టులు, అంబేద్కరిస్టులు ఇద్దరూ చదవాలి.

ఈ ఇద్దరూ భౌతిక వాదులే. శరత్‌ కవితల్లో ఈ ఇద్దరి మానవ సిద్ధాంతాలు కవిత్వరూపం ధరించాయి. 'మనిషే' వంటి కవితల్లో శరత్‌లోని మానవ ప్రేమ కనిపిస్తుంది.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణను వ్యతిరేకించని రచయిత ప్రజారచయిత కాలేడు. 'ఆధునిక బానిసత్వం' 'నేనిప్పుడు కవిత చెప్పలేను' వంటి కవితలలో శరత్‌లోని ప్రపంచీకరణ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది.

'యుద్ధం జరగాల్సిందే' అంటున్న అభ్యుదయ కవిలోని తాత్వికతను పట్టిస్తున్నది. శరత్‌ కవిత్వం నిండా ఒక తపన ధ్వనిస్తుంది. ఒక అన్వేషణ వ్యంజిస్తుంది. ఆయనవే అయిన కొన్ని అభిరుచులు తొంగిచూస్తుంటాయి. ఆయనలో ఒక బహిర్ముఖుడు, మరో అంతర్ముఖుడు స్నేహం చేస్తున్నట్లనిపిస్తుంది.

- ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

అధ్యక్షులు - ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం (అరసం)

పేజీలు : 61

Write a review

Note: HTML is not translated!
Bad           Good