ఒక శతాబ్దకాలంలో (1900 - 2000) తెలుగులో వెలువడిన వేలకొలది నాటికల నుండి ఏర్చి కూర్చి వల్లూరు శివప్రసాద్ మన తరానికి బహూకరిస్తున్న అర్థనూటపదహారు సాంఘిక నాటికల సంకలనం ఇది. ఇప్పటికే వచ్చిన పలు నాటికల సంకలనాలకన్నా భిన్నమైనది. వైవిధ్య భరితమైనదీ.
ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కవిత, కథానిక, నవలల్లాగే నాటిక కూడా సాంఘిక ప్రయోజనం పరమావధిగా పుట్టుకొచ్చినదే! తెలుగువారి సాంఘిక జీవితాన్ని బహుకోణాలలో ప్రదర్శించినదే! ఒక శతాబ్ది కాలంలో తెలుగు సమాజంలో వచ్చిన అనేక పరిణామాలను ఎప్పటికప్పుడు చిత్రిక పట్టినదే! సంఘజీవితంలో ఏర్పడ్డ అనేకమైన ఎగుడు దిగుళ్లను విమర్శనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, ప్రయోగాత్మకంగా ప్రతిఫలించినదే! సంఘ పురోగమనానికి అడ్డుపడే దౌష్ట్యాలనూ, సంఘజీవితాన్ని విచ్ఛిన్నం చేసే క్రౌర్యాలనూ బయట పెట్టినదే! సమాజం సుఖ శాంతులతో విలసిల్లాలని, వికసిల్లాలని కూడా ఆకాంక్షను వ్యక్తం చేసిందీ తెలుగు నాటిక.
ఈ సాంఘిక సూత్రాల ఆధారంగా కూర్చిన ప్రయోజనాత్మక నాటికల సంకలనం యిది. వందేళ్ళ తెలుగు దేశపు సంఘ జీవితానికి నిలువుటద్దం ఈ విశిష్ట నాటికల సంకలనం. వందేళ్ల కాలంలో తెలుగు నాట వచ్చిన అనేక పరిణామాలనూ, సామాజికాంశాలనూ, తెలుగు ప్రజల జీవన విధానాలనీ, నడకల్నీ, నడవడికల్నీ ప్రతిబింబించేలా కూర్చిన సంకలనం ఇది.
విశాలాంధ్ర ప్రచురణాలయం తన యాభై ఎనిమిదేళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో ప్రజా సాంస్కృతికోద్యమానికి అందిస్తున్న 58 నాటికల అపురూప కానుక ఈ సంకలనం.
Rs.600.00
In Stock
-
+