Rs.170.00
In Stock
-
+
ఎన్.తారక రామారావు కథకుడు, నటుడు, నాటక రచయిత. ఆయన రచించిన బకాసుర, జనమే జయం, యాజ్ఞసేని ఆత్మకథ, ఈ మూడు నాటకాల సంకలనమే ఈ 'జయం నాటకత్రయం'. ప్రాచీన సమాజంలో, వర్తమాన సమాజంలో స్థితిగతులపై నిశితమైన విమర్శ బకాసుర నాటకంలో వున్నది.
'జనమేజయం'లో కథ చాలావరకు వ్యాస భారతకథనే అనుసరించింది. పాత్రల స్వభావాల్లోను మార్పులేదు. సుయోధనుని గదా యుద్ధం, తొడలు విరిగి పడిపోయిన తర్వాత సుయోధనుడు శ్రీకృష్ణుని నిందించి శపించిన తీరు భాసమహాకవి 'ఊరుభంగము'ను తలపించాయి. ఈ దృశ్యం 'జనమేజయం'లో కరుణ రసభరితంగా హృద్యంగా వున్నది.
రామాయంలో సీత అయోనిజ. మహాభారతంలో ద్రౌపది అయోనిజ. ఈ రెండు పాత్రుల వాటి సృష్టి రూప కల్పన అద్భుతం. ఆనాటి యాజ్ఞసేని కథ, ఆత్మకథ, ఆమె అనుభూతుల సారాంశం' యాజ్ఞసేని ఆత్మకథ నాటకం