నెర్లే హార్పర్ లీ వ్రాసిన 'టు కిల్ ఎ మాకింగ్ బర్డ్' అనే నవల అనువాదం 'నేలకొరిగిన కోకిల'. 1960లో రాసిన ఈ నవలకు కేవలం ఏడాదిలోనే అంటే 1961లో పులిజర్ బహుమతి లభించింది. ఆధునిక అమెరికన్ సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన నవలగా పేరు తెచ్చుకుంది. 2007లో ఈ నవలకుగాను హార్పర్ లీ 'ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడం' అవార్డును కూడా పొందారు. అంతేకాదు ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆమెను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాయి.
ధనవంతులైన తెల్లజాతీయులు, నల్ల జాతీయుల పట్ల చూపే వివక్షను ఈ నవల ద్వారా మన కళ్లముందు ఆవిష్కరించారు రచయిత. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని అంటున్నా న్యాయం ఎంత పాక్షికంగా ఉటుందో హృద్యంగా చిత్రించారు.
పేజీలు : 320