పాఠకులు లోతుగా ఆలోచించేలా ఈ వ్యాసాల్ని జాహ్నవి రాశారు. దాదాపు నాలుగేళ్ళపాటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వీక్లీ కాలమ్‌గా సాగిన 'మేధోమధనం' వ్యాసాలు పూర్తయి ఇప్పటికి నాలుగేళ్ళు కావస్తోంది. వాటిల్లో తన అంచనాలు ఈ నాలుగేళ్లలో ఏ మేరకు రుజువయ్యాయన్నది పక్కనపెడితే... ఆ వాదనలకు ఇప్పటికీ వన్నె తగ్గలేదు.

మన జీవితంలో ఓ 60-70 శాతం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. మిగిలిన 30-40 శాతం ... సమాజం, ప్రభుత్వం ఇలా మన చుట్టూ ఉన్న ప్రపంచం చేతుల్లో ఉంటుంది. ఇది ఉజ్జాయింపు అంచనాయే! చుట్టూ ఉన్న సమాజం, రాజకీయం, పాలన సరిగా లేకపోతే మనం ఎంత తపనపడ్డా, కష్టపడ్డా అనుకున్న స్థాయికి చేరలేకపోవచ్చు. ఆశించిన ఆనందాల్ని పొందలేకపోవచ్చు. అందుకే ఆ 30-40 శాతం గురించి చెప్పిన జాహ్నవి 'మేధోమధనం' మనకు అంత ముఖ్యమైనది.

యువత కావచ్చు, మిగిలిన వయసులవారు కావచ్చు... ప్రొఫెషనల్‌గానే జాహ్నవి మేధోమధనంలో భాగస్వాములవ్వండి. ఇందులోని వ్యాసాలను గతంలో చదివినవారు కూడా మరోమారు చదవటం మేలు. మేధోమధనం వ్యాసాల తదనంతర పరిణామాల నేపథ్యంలో వాస్తవాలను బేరీజు వేసుకుని అభిప్రాయాలను మెరుగుపరచుకోవడానికి ఇది అవసరం.....

పేజీలు : 480

Write a review

Note: HTML is not translated!
Bad           Good