ఒకప్పుడు తంబుచెట్టి వీధిలో 'భారతి' ఆఫీసులో గన్నవరపు సుబ్బరామయ్య గారితో ప్రసంగం ముగించి బైటికి వచ్చాను. అక్కడే ఉన్న ఒక ఆసామి నాతోబాటు తానూ బైటికి వచ్చాడు. ఎలా పోల్చుకున్నానో ఇప్పటికీ నాకు తెలియదు. అతను ఫలానా అని ధృఢనిశ్చయం కలిగింది.
సుబ్బరామయ్యగారితో సంభాషణ వల్ల 'అతనికి' నేనెవరినో తెలిసింది. అంతసేపూ అక్కడే కూర్చున్న అతణ్ణి నేను చూసీ చూడనట్లే ఊరుకున్నాను. ఎవడో ఉద్యోగస్థుడు అని మాత్రమే అనుకున్నాను. 'అతను' అని మాత్రం నాకప్పటికి తెలియదు.
పేజీలు : 32