రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ ఒక పెద్ద అవినీతి తిమింగలం. కానీ అతన్ని సిబిఐ కూడా పట్టుకోలేకపోయింది. ప్రకృతిపై అతనికున్న ఒకే ఒక బలహీనత వల్ల నక్సలైట్లు అతన్ని కిడ్నాప్‌ చేయగలిగారు. వారి వ్యూమం, ప్రభుత్వ ఆధీనంలో విచారణ లేకుండా మగ్గుతున్న తమ ముగ్గురు కామ్రేడ్లను విడిపించుకోవడం, అలాగే కొన్ని కోట్ల విలువైన అతని అవినీతి సంపాదన వెలికితీసి తమ పోరాటానికి ఉపయోగించుకోవడం. వారు దానిని సాధించగలిగారా? వివరాలను బహిర్గతం చేయడం ఇష్టంలేక అతను తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టేందుకు ఎందుకు పూనుకున్నాడు? చివరికి ఆ సంపాదన ఎవరికి అందింది?

మూడు లక్షల చదరపు కిలోమీటర్లున్న శేషాచలం అడవుల్లో అతన్ని రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నించి విజయం సాధించగలిగిందా? ఈ కిడ్నాప్‌లో ఎంతమంది సమిధలైనారు? ఇందులో ముఖ్యమంత్రి పాత్ర ఎంత?

అరవై ఐదు శాతం యువతను కలిగి ఉన్న భారతదేశంలో కుల, మత, వర్గాలకు అతీతంగా, అవినీతిరహిత పౌరులుగా తీర్చిదిద్దగల సంవిధానం ఏదైనా కార్యాచరణలో ఉందా? మన కలల భారతాన్ని ఆవిష్కరించగలమా? ఈ కిడ్నాప్‌ దేశ దిశానిర్దేశాన్ని మారుస్తుందా? అతివాదులను జనజీవనంలో కలుపుతుందా? ఈ ప్రశ్నలకు ఈ నవలలో సమాధానం దొరుకుతుంది.

మీరెప్పుడైనా అరణ్యాలలో రాత్రింబగళ్ళు సంచరించారా? అడవిలో వర్షం వస్తే ఎలా ఉంటుంది? అడవిలో అతి క్రూరమైన జంతువేది? అడవుల్లో తిరిగే మావోయిస్టులకే అడవుల్లో ఆరోగ్యమైన ఆహారంతో ఎలా బతకాలో నేర్పగలిగిన ఆ చీఫ్‌ సెక్రటరీ ఎలాంటివాడు?

అరణ్యంలో అడుగడుగునా సాగే వింత అనుభవాలతో మీ ఎదురుగా ఒక కిడ్నాప్‌ డ్రామా ఆవిష్కృతమౌతుంది. పుస్తకం పట్టుకుంటే వదలలేని అనుభవానికి మీరు సిద్ధంకండి!

పేజీలు : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good