సాహిత్యం ఎప్పటికప్పుడు నిత్యచైతన్యశీలముగాను, సృజనశీలతగానూ ఉంటుంది. ఆ స్ఫూర్తితోనే మరికొన్ని కథలను పరిచయం చేద్దామనే చిన్న ప్రయత్నంతో, పదహారు కథలను ''హనుమంకొండ కథలు'' శీర్షికతో అందిస్తున్నాము. ఇందులోని  కథకులందరూ అడపాదడపా కథలు రాస్తున్నవారే. ఇకరిద్దరు అచ్చులో ఇక్కడ పరిచయమౌతున్నారు. అందువలన ఇవి షోడషకళలు. ఈ కథకులలో పల్లె సీమ, తమ్మెర రాధిక, వేముగంటి శుక్తిమతి, ప్రభాకర్‌ జైని, వరిగొండ కాంతారావు గార్లు నవలా రచయితలు కూడా. ఈ కథలలో సమాజ వ్యవస్థ, మనస్తత్వ చిత్రణ, జీవన మూల్యాలు, అనుభూతిని చిత్రించారు. తాము చెప్పదల్చుకున్నది మనసుకు పట్టుకుంటే చాలు అను భావన ఉన్నవారు. మాండలికాన్ని తమ కథలలో వాడుకొని ఈ ప్రాంత మూలాలను అందించారు.

పేజీలు : 144


Write a review

Note: HTML is not translated!
Bad           Good