ఈ దేశంలో ఒక భాగమిది

మనిషిని కాల్చేసే బాధలుంటాయి.
మనిషిని పీల్చేసే బాధలుంటాయి.
మనిషిని తొలిచేసే బాధలుంటాయి.
ఎంతోమంది నరకం అనుకుంటూ అనుభవించేదీ,
విముక్తి పొందుదామని అనుక్షణం తపిస్తూ తప్పించుకోలేనిది,
అడుగడుక్కీ నసలతో నలిగిపోయేది ఒకటుంది -
అది సమిష్టి కుటుంబాల అంతర్ఘోష!
కలిసివుంటూ ఒకర్నొకరు భరించలేకుండా వుంటూ,
ఒక చూరు కింద బ్రతుకుతూ, నిరంతరం దోషాలనే
వెదుక్కుంటూ, ప్రేమ వుండవలసిన చోట ద్వేషం,
అనురాగం వుండవలసిన చోట వంచన, ఆత్మీయత కావలసిన
చోట అసూయ, అసహ్యమైన నిశ్శబ్దంలాంటి భయంకర
రణగొణధ్వని, విసుర్లు, కసుర్లు, విరుపులు, అరుపులు అసలు
విషయం క్రక్కలేక మరో రూపంలో బయటపడే ఆక్రందనలు
మంచి మనుషుల్ని కూడా వికృతంగా చాటే వికారాలు...
ఈ నిజాల నిజరూప దర్శనమే - 'ఈ దేశంలో ఒక భాగమిది!'

Write a review

Note: HTML is not translated!
Bad           Good