ఈ పుస్తకంలో కనబడే గాధలు నేను రాసినవి కావు.

ఒక సంస్కర్త భార్యా, ఒక పాటల కవి భార్యా రాసినవి.

స్త్రీ పురుషుల కుటుంబ సంబంధాల్ని ధ్వంసం చేసే అసలైన నీచ విషయం, వ్యభిచారాలే. అవి, పురుషాధిక్యత నించి పుట్టుకు వచ్చే నేరాలే. ఆ నేరాలు, భర్తలవి అవినా, భార్యలవి అయినా, అవి, కుటుంబ శాంతి సౌఖ్యాల్నీ, బిడ్డల అనురాగ పెంపకాల్నీ, ధ్వంసం చేసే నేరాలే.


ఈ స్త్రీల చరిత్రలు చూపించిన పురుషాహంకారాలు, కట్టు కథలు కావు, సాహిత్య కల్పనలు కావు. యధార్థంగా ఆ భార్యలు రాసిన సత్యాలు! ఆ భార్యలు రాల్చిన కన్నీటి చుక్కలు! కన్నీటి ధారలు! వేరు వేరు సందర్భాల్లో ఇవి నా చేతుల్లోకి వచ్చాయి. వీటిని నేను ఏళ్ళ తరబడీ భద్రపరచి వుంచాను. ఇప్పటికి వీటిని బైట పెడుతున్నాను.


ఆ స్త్రీల భర్తల పేరులూ, వారి వూరులూ, అవసరం లేదు. జరిగిన విషయాలూ, సంఘటనలూ, కనపడితే చాలు. తెలుసుకోవలసింది వాటినే.


- రంగనాయకమ్మ

Write a review

Note: HTML is not translated!
Bad           Good