రవీంద్రనాథ ఠాకూర్‌ (గారు) అనేకములగు కవితలు, కథలు, నవలలు, నాటికలు వ్రాయడమేకాక ఆకర్షణీయ విషయములపై ఆలోచనా ప్రేరకమైన అనేక వ్యాసములు కూడా విరచించియున్నారు. ఈ సంపుటంలో రవీంద్ర విరచితములైన 36 వ్యాసములు - మహాపురుషుల జీవితములు, చారిత్రక ధార్మిక విద్యావిషయములు, సాంఘిక రాజకీయ విషయకములు - 6 శీర్షికలుగా విభజింపబడి ప్రచురితమైనాయి.
రామాయణం, మహాభారతములలోని అంశములను చర్చించిన సందర్భంలో రవీంద్రునికి ఆయా పురాణవిషయములో గల పాండిత్యం ప్రకాశితమవుతుంది.  కాళిదాసుని శాకుంతలము, కుమారసంభవములను గురించిన వ్యాసములలో ఆయన వ్యాఖ్యలు ఆయా నాటముల సౌందర్యశోభను ఇనుమడింపజేస్తాయి. రాజకీయ సమస్యలను గురించిన వ్యాసములలో ఆయన నిజాయితికి, సచ్చీలమునకూ, సత్యవర్తనకూ గల ప్రాధాన్యాన్ని ఉగ్గడించారు. రాజకీయరంగంలో ఆ గుణత్రయం ఆ వ్యాసముల రచనాకాలంలో ఎంత ప్రధానమో ఇప్పుడూ అంతే అని నిస్సందేహంగా చెప్పవచ్చును.

Write a review

Note: HTML is not translated!
Bad           Good