ప్రాచీన యుగాలలో విజ్ఞానం కొన్ని వర్గాలకే పరిమితమయింది. అందరికీ అన్ని విషయాలు తెలిసేవి కావు. కొందరికే అన్ని విషయాలు గుత్తాగా ఉండేవి. ప్రజాస్వామ్య యుగంలో ఈ పరిస్థితి తిరగబడాలి. విజ్ఞానం అందరి సొత్తు కావాలి. ప్రాచీన కాలంలో విజ్ఞానం కొందరికే పరిమితమయింది. "వారు చెప్పిన సామాజిక నియమాలు, ఆచరణలు వారి కాలంలోనే సామాజిక వివక్షకు, జండర్ వివక్షకు ఎందుకు కారణమయ్యాయి" అని ఆలోచించడం ఈనాటి ప్రజాస్వామ్య యుగలక్షణం. ఇలా ప్రశ్నించడానికి కూడా ప్రాచీన విలువల పట్ల, సామాజిక విషయాలను తెలిపే సాహిత్యం పట్ల ఈ తరానికి మంచి అవగాహన ఉండాలి. ఈ అవగాహన కలిగించడంలో ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good